కీళ్ల మార్పిడిలో కొత్త ఆశ


Sat,June 17, 2017 12:46 AM

AdobeStock
మోకాళ్ల నొప్పి అంటే ఇప్పుడు మోకాలి మార్పిడి చికిత్సే గుర్తుకువస్తున్నది. ఆర్థరైటిస్ వచ్చిందంటే ఇక జీవితాంతం మోకాలి నొప్పితో బాధపడాల్సిందే అనుకునేవాళ్లు. మందులు వేసుకుంటూ కాలం గడిపేవాళ్లు. కాని ఇప్పుడా సమస్య లేదు. దెబ్బతిన్న కీలు స్థానంలో కొత్త ఇంప్లాంట్ వేసి నొప్పి నుంచి బయటపడేస్తున్నది ఆధునిక వైద్య రంగం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తుండడంతో టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీలు ఇప్పుడు ఎక్కువయ్యాయి కూడా. మోకాళ్ల నొప్పులున్న చాలామంది ఈ సర్జరీలను ఎంచుకుంటున్నారు.సాధారణంగా కీలుమార్పిడి చేసినప్పుడు కొత్త కీలు 10 నుంచి 15 ఏళ్ల వరకు పాడైపోకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే 25 ఏళ్ల వరకు మన్నిక ఉండే ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి. అయితే వీటి ఖర్చు ఎక్కువ. దాంతో చాలామంది పేషెంట్లు ఏం చేయాలో దేన్ని ఎంచుకోవాలో అర్థం కాకుండా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆల్ పాలీ జాయింట్‌రీప్లేస్‌మెంట్‌పై జరిగిన ఓ అధ్యయనం కొత్త ఆశల్ని కలిగిస్తున్నది. పాశ్చాత్య డాక్టర్లు చేసిన ఈ అధ్యయనంలో భాగంగా 25 వేల మందిని పరిశీలించారు. పదేళ్ల కాల వ్యవధిలో అన్ని ఆల్ పాలీ నీ రీప్లేస్‌మెంట్స్ కూడా మంచి ఫలితాలను అందించినట్టు నిపుణులు గమనించారు. ఖరీదైన లోహపు కృత్రిమ కీళ్లతో చేసే రీప్లేస్‌మెంట్ కన్నా కూడా ఆల్ పాలీ నీ రీప్లేస్‌మెంట్ ఎక్కువ మన్నికైనదని ఈ అధ్యయనం ద్వారా తేల్చారు.
aachi
మా సెంటర్‌లో కూడా ఈ ఆల్ పాలీ జాయింట్లను చాలాకాలంగా వాడుతున్నాం. తక్కువ ఖర్చుతోనే ఈ రకమైన నీ రీప్లేస్‌మెంట్ సర్జరీలను చేయవచ్చు.టిబియల్ కాంపొనెంట్ ఉన్న ఈ ఇంప్లాంట్స్‌ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేశారు. దీర్ఘకాలం మన్నిక గల ఇంప్లాంట్స్ తక్కువ ఖర్చుతో కావాలనుకునేవాళ్లకు దీనిలోని పాలీఇథిలీన్ వరం లాంటిది.విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆల్ పాలీ జాయింట్ రీప్లేస్‌మెంట్ చేయించుకోవాలనుకుంటే ఈహెచ్‌ఎస్ పేషెంట్లకు (రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు) క్యాష్‌లెస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నది.

417
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles