కీళ్ల నొప్పులకు కొత్త చికిత్స


Sun,February 18, 2018 01:57 AM

Knee-Pain-Relief
ప్రపంచవ్యాప్తంగా చాలామంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు సంప్రదాయ విధానాల్లో ముందుగా మందులు, ఫిజియోథెరపీ, తర్వాత కాలంలో పూర్తి మోకలి కీలు మార్పిడి చికిత్స అందించేవారు. నిజానికి మోకాలి కీలు మార్పిడి చేసే సర్జరీ ఒక మేజర్ సర్జరీ. ఇందుకు నిపుణులైన డాక్టర్లు, అందుకు అవసరమయ్యే పరికరాలు, సౌకర్యాలు అన్ని కలిగిన హస్పిటల్ అవసరమవుతుంది. సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ, సరైన వ్యాయామాలు, మందుల వంటి రీహాబిలిటేషన్ అవసరమవుతుంది. అయితే ఈ సర్జరీతో సుదీర్ఘకాలం పాటు నొప్పిలేని సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపడం సాధ్యపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందిన వైద్య విధానం.

కొత్త చికిత్స

అయితే ఇప్పుడు అధునాత చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. మోకాలి కీలులోని రెండు ఎముకల మధ్య రాపిడిని నివారించేందుకుగాను కార్టిలేజ్ అనే మృదులాస్థి భాగం ఉంటుంది. ఇది దెబ్బతినడం వల్ల మోకాలి కీలులోని రెండు ఎముకల మధ్య రాపిడి జరిగి నొప్పి వస్తుంది. కొత్త శాస్త్ర పరిజ్ఞానం మరింత అధునాతన చికిత్సా విధానాలను అందిస్తున్నది. భాగంగా పేషెంట్ కార్టిలేజ్ నుంచి కొంత సేకరించి ప్రయోగశాలలో కల్చర్ చెయ్యడం ద్వారా కొత్త కార్టిలేజ్‌ను వృద్ధి చేసి దాన్ని తిరిగి పేషెంట్ మోకాలి కీళ్ల మధ్య అమరుస్తారు. ఇలా చేయడం ద్వారా మోకాలి కీలు మార్పిడి అవసరం ఉండదు. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స ఒక వరం లాంటిది. దీర్ఘకాలికంగా మంచి ఫలితాలను అందిస్తుంది.
Knee-Pain-Relief1

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles