కీళ్లనొప్పులకు జానువస్తి చికిత్స


Thu,August 31, 2017 01:27 AM

ఆస్టియో

ఆర్ధరైటిస్‌తో బాధపడేవాళ్లలో ఎక్కువ మంది వయసు పైబడిన వాళ్లే ఉంటారు. మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ బొత్తిగా లేకపోవడం వంటివే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. మోకాళ్ల నొప్పి కాస్త ఎక్కువగా అనిపిస్తే బామ్‌లు రాసుకుంటూ, పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ తాత్కాలిక ఉపశమనాలతో సమాధానపడుతారు. కొద్ది గంటలు అయిపోగానే నొప్పి మళ్లీ మొదలవుతుంది. ఎవరైనా కీళ్లనొప్పుల సమస్యను సమూలంగా తొలిగించుకోవాలంటే మాత్రం ఆయుర్వేదాన్ని ఆశ్రయించడమే మంచిది.

సంధివాతం అంటే..?

శరీరంలోని సమస్త కదలికలకు అవసరమైన వాతం అందరి శరీరంలోనూ సహజంగానే ఉంటుంది. అయితే ఈ వాతం ప్రకోపితమైనప్పుడు అంటే దాని సమతుల్యత కోల్పోయినప్పుడు మొదలయ్యేదే సంధివాతం లేదా ఆస్టియో ఆర్థరైటిస్. దీన్నే వాతం దూషితం కావడంగా పరిగణిస్తారు. సాధారణంగా కఫాన్ని వాతం దూషితం చేసినప్పుడే సంధివాతం మొదలవుతుంది. ఇలాంటప్పుడు కీళ్లు బిగుసుకుపోవడం, కదిలినప్పుడు శబ్దాలు రావడం, ముట్టుకున్నప్పుడు ఆ భాగం వేడిగా అనిపించడం, ఎరుపుదనం కలిగివుండడం, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు నొప్పి అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని దూషిత లక్షణాలంటారు. కొంతమందిలో చాలాసేపు కూర్చున్న తరువాత గాని, పడుకొని లేచినప్పుడు గాని, వెంటనే లేచి నడువలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కాసేపు నడిచాక బిగుసుకుపోయిన భాగాలు సడలిపోయి, నడకలో కొంత సౌకర్యం ఏర్పడుతుంది. సంధివాతంలో ఇది ఒక ముఖ్య లక్షణంగా ఉంటుంది.

కీళ్లు.. రకాలు

కీళ్లను చల, స్థిర సంధులని రెండు భాగాలుగా విడదీయవచ్చు. కదిలే కీళ్లను చల సంధులనీ, కదలని కీళ్లను స్థిర సంధులనీ అంటారు. ఈ కదిలే చల సంధుల్లోనే కీళ్ల వాతం వస్తుంది. చల సంధుల్లోనే కీళ్లవాతం రావడానికి శరీర భాగాలన్నింటినీ ఆవరించుకొని, కొన్ని పొరలు (మెంబ్రేన్‌లు) దెబ్బతినడమే కారణం. మొత్తంగా అష్టాధర కలలు (ఎనిమిది పొరలు) ఉంటాయి. వాటిలో శ్లేష్మధరా కల అనే ఒక పొర ఉంటుంది. దీన్నే సైనోవియల్ మెంబ్రేన్ అంటారు. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ కీళ్లు కదలడానికి తోడ్పడుతూ ఉంటుంది. కదిలే కీళ్లు సహజంగా శ్లేష్మం, సిరలు, కండరాలతో కూడుకొని ఉంటాయి. ఈ శ్లేష్మధరా కల వాత ప్రకోపంతో దూషింపబడినప్పుడు అది తన సహజస్థితిని కోల్పోతుంది. దీనివల్ల శరీరంలో ఆమం అంటే వ్యర్థ విష పదార్థాలు ఏర్పడుతాయి. ఫలితంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అందులో భాగంగా మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి.

ఆహార, విహార లోపాలు..

ఆహార విషయాల్లో సరైన ఆహారం తీసుకోవడం, తీసుకున్న ఆహారం జీర్ణం కాకముందే మళ్లీ తినడం, పొడి ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాల వల్ల మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా, ఆమం అనే ఒక విషపదార్థం శరీరంలో ఏర్పడుతుంది. సరైన వేళకు నిద్రించకపోవడం, ఉదయం ఎక్కువ సమయం పడుకునే ఉండడం, రాత్రివేళ ఎక్కువ సమయం మేల్కొని ఉండడం, ఎక్కువ గంటలు కదులకుండా పనిచేసే వృత్తిలో ఉండడం, ఇటువంటి విహార కారణాల వల్ల మోకాళ్లలోని వాతం దూషించబడుతుంది. ఈ దూషిత వాతమే మోకాళ్ల నొప్పులకు కారణమవుతుంది.
srinivas

ఆయుర్వేద చికిత్స

సంధివాతం (కీళ్లనొప్పులు) ఏ కారణంగా మొదలైనా, వాత హర చికిత్సలు చేయడం ద్వారా ఆ సమస్యను తొలిగించవచ్చు. అయితే, అరిగిపోయిన కార్టిలేజ్ తిరిగి వృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్య శాశ్వతంగా తొలిగిపోతుంది. అందుకుగాను ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధయుక్త తైలాలతో చేసే జానువస్తి చికిత్స ఉంటుంది. దీనివల్ల మోకాళ్లలో అరిగిపోయిన భాగాలన్నీ తిరిగి వృద్ధి చెందుతాయి. తైలాలు, కొన్ని రకాల మాత్రల ద్వారా అరిగిపోయిన కార్టిలేజ్‌ను తిరిగి ఉద్ధరించే పూర్తి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి కార్టిలేజ్‌ను పునరుద్ధరించే శక్తి ఆయుర్వేద తైలాలకు మాత్రమే ఉంది. జానువస్తి చికిత్సలు ఎవరైనా చేయవచ్చు. కానీ ఆ సమయంలో కీళ్లలోకి పంపించే తైలం పాత్రే ఇక్కడ కీలకం. ఆ తైలం ఎంతో ప్రత్యేకమైనది. ప్రత్యేక తైలాలు, ప్రత్యేకమైన ఔషధాలతో మోకాళ్ల నొప్పులు సమూలంగా తొలిగిపోతాయి. ఆయుర్వేద వైద్యుల్ని సూచించిన చికిత్సలన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే, తిరిగి యుక్త వయసులోకి ప్రవేశించినంత ఆనందం, ఉత్సాహం కలుగుతాయి.

529
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles