కీలు మార్పిడిలో రోబోటిక్స్


Tue,August 1, 2017 12:42 AM

కీలు మార్పిడిలో వివిధ రకాల ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. శస్త్రచికిత్సా విధానాలు కొత్త శాస్త్రపరిజ్ఞానాన్ని అనుసరించి చేసేవి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ కాలం మన్నే ఇంప్లాంట్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పుడు కీలు మార్పిడి సర్జరీల్లో ఒక కొత్త శకంగా చెప్పుకునే రోబోటిక్స్ సహాయంతో చేసే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది.
robo
చిన్న కోత వల్ల మృదు కణజాలాన్ని కచ్చితమైన విధంగా సమతుల్యపరచడం వల్ల పేషెంటుకు నొప్పి తక్కువగా ఉండడం, త్వరగా కోలుకోవడం వంటి సంప్రదాయ విధానంలో చేసే సర్జరీల్లో కొంచెం కష్టం.

రోబొటిక్స్‌లో ప్రయోజనాలు


-గాయం చిన్నగా ఉండడం వల్ల తక్కువ నొప్పి.
-సహజమైన కీలు మాదిరిగానే పనిచేస్తుంది.
-తక్కువ రక్తస్రావం.
-ఇంప్లాంట్ మన్నికలో పెరుగుదల
-హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండే అవసరం లేకపోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం.
ఎముకలో పాడయిపోయిన భాగాన్ని కచ్చితంగా గుర్తించి, అవసరమైన వరకే, కేవలం పాడయిన భాగాన్ని మాత్రమే తీయడంలో ఈ రోబోటిక్స్ సహాయపడుతుంది. ఇంప్లాంట్ పరిమాణం కచ్చితంగా బేరీజు వేసి కచ్చితమైన స్థానంలో అమర్చడం వల్ల ఈ రొబోటిక్స్ శస్త్రచికిత్సల వల్ల మెరుగైన ఫలితం సాధించవచ్చు. ఈ పద్ధతిలో అత్యంత ఆధునికమైన, అత్యంత విలువైన కీలు మార్పిడి సాధ్యపడుతుంది. సహజంగా మోకాలి కీలు పునర్నిర్మాణం జరిగిన విధంగా ఇంప్లాంట్ ఎక్కువ కాలం మన్నడం వల్ల జీవనశైలి మెరుగ్గా ఉంటుంది.
వైద్య విధానాల్లో ఉపయోగించే టెక్నాలజీ దినదిన ప్రవర్థమానం చెందుతున్నాయి. రోబొటిక్స్ కూడా చాలా పురోగతి సాధించాం. క్యాన్సర్‌కు సంబంధించిన సర్జరీలు, న్యూరో సర్జరీలు, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాలలో కూడా రోబోటిక్స్ మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

keerthi
వయసు పైబడిన వారిలో కీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా, జీవితాన్ని మార్చే విధంగా ఉండడానికి రోబోటిక్ ఇంజనీర్లు, సర్జన్లు కలిసి పనిచేయడం 2010 నుంచి ప్రారంభించారు. 2012లో తొలిసారి ఎఫ్‌డీఏ అనుమతి లభించింది.
ఎముకలోని మృదులాస్థిని కత్తిరించడంలో రోబోటిక్స్ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. కేవలం పాడయిపోయిన మృదులాస్థిని మాత్రమే తొలగించి ఆరోగ్యంగా ఉన్న మృదులాస్థికి కనీసం ఒక మిల్లీ మీటర్ కూడా నష్టం లేకుండా ఎంత వరకు తీసేయ్యాలో అంత వరకు మాత్రమే కట్ చేయడానికి విలవుతుంది. దీన్ని డాక్టర్ తన చేత్తో పట్టుకొని ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి కచ్చితత్వం చాలా ఎక్కువ.

411
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles