కిడ్నీలో.. ఈ సంకేతాలుంటే?


Mon,August 20, 2018 11:23 PM

జాగ్రత్త

Kidney-Stones
కిడ్నీ వ్యాధులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. కిడ్నీలో సమస్యలున్నట్లు గుర్తించడానికి శరీరం కొన్ని సంకేతాలను అందిస్తుంది. వాటిని మనం పసిగట్టి వ్యాధిని గుర్తించాలి.
-మూత్ర పరిమాణం తగ్గటం లేదా అధిక మొత్తంలో లవణాలు స్పటికాలుగా మారటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఉదర భాగంలో గానీ.. వెన్ను భాగంలో గానీ నొప్పి కలుగుతుంది.
-తరచుగా మూత్రం రావడం. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో నొప్పి కలిగితే ఆలస్యం చేయొద్దు. రాళ్లు మూత్ర మార్గం నుంచి మూత్రాశయంలోకి ప్రవేశించేపుడు తరుచూ మూత్ర విసర్జన వస్తుంది.
-వెన్నుభాగంలో నొప్పి కలిగితే కిడ్నీలో సమస్య ఉన్నట్టే. ఇదే సమస్య ఉదరభాగంలో కూడా కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లుగానీ, ఇతర వేరే సమస్యలుగానీ ఉన్నట్లు పసిగట్టాలి.
-మూత్రంలో రక్తం వస్తుంది. కొన్నిసార్లు రంగు మారుతుంది. ఆలస్యం చేస్తే మూత్రం పింక్.. ఎరుపు.. గోధుమ రంగుల్లో వస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డాయనడానికి ఇవి మంచి సంకేతాలు.
-కొన్నిసార్లు కూర్చోటానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అలా కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఉదర భాగంలో, వెన్నెముక భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. వెన్నెముక భాగంలో వాపు వస్తుంది. ఇలాంటి సంకేతాలను కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా భావించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


నెక్‌టై

tei
నెక్‌టై ధరించడం వల్ల మెదడుకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో 7.5% తగ్గుతుంది అని ఎంఆర్‌ఐ స్కానింగ్ సూచిస్తుంది. ఇది కాగ్నిటివ్ ఫంక్షనింగ్‌ను సమర్ధవంతంగా చేయడంలో దోహదం చేస్తుంది.

87
Tags

More News

VIRAL NEWS