కాళ్లలో ఈ నొప్పి ఎందుకు?


Fri,June 23, 2017 11:57 PM

నా వయసు 38 సంవత్సరాలు. పదేళ్లుగా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాళ్లలో నొప్పి వస్తున్నది. రాత్రుళ్లు పిక్కల్లో పట్టేసినట్టుగా నొప్పి వస్తున్నది. చిన్న సమస్యగా భావించి ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకు సమస్య ఎక్కువ అవుతున్నది. తీవ్రమైన అసౌకర్యంగా ఉంటున్నది. డ్యూటీలోనూ ఈ సమస్య ఈమధ్య వేధిస్తున్నది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి సమస్య నాకు లేదు. నాకు ఏం జరుగుతున్నదో తెలియడం లేదు. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.
బి . నరసింహా, యాదగిరి గుట్ట

Dollarphotoclub
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు వెరికోస్ వీన్స్ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. ఎక్కువ సమయం నిలబడి ఉండేవారిలో ఈ సమస్య రావడానికి ఆస్కారం ఎక్కువ. ముందుగా మీరు వైద్యులను సంప్రదించి వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. వెరికోస్ వీన్స్ సమస్యలో నాలుగు దశలు ఉంటాయి. వ్యాధి దశను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మీకు వెరికోస్ వీన్స్ నిర్ధారణ జరిగినా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పుడు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

మొదటిదశ, రెండవ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే చాలా వరకు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. మొదటి, రెండో దశలో ఉంటే మందులు వాడుతూ వైద్యులు సూచించిన విధంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో సాగే సాక్సులు, పట్టీలు ధరించాలి. మూడు, నాలుగు దశల్లో ఉన్నవారికి సర్జరీ, లేజర్ చికిత్స అవసరమవుతాయి.
dr;dhevendhar
ప్రాథమిక దశలో ఉన్నపుడే చికిత్స ప్రారంభిస్తే సులువుగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆలస్యం అయ్యేకొద్దీ చికిత్స సంక్లిష్టమవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీకు దగ్గరలో ఉన్న వ్యాస్క్యూలార్ నిపుణులను సంప్రదించడం మంచిది.

654
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles