కాలేయ సమస్యలకు లాపరోస్కోపీ


Wed,December 9, 2015 12:31 AM

మానవ శరీరంలో కాలేయం ఒక ప్రధానమైన అవయవం. జీర్ణ వ్యవస్థలో అనుబంధ గ్రంథిగా ఉండి పైత్య రాసాన్ని స్రవిస్తుంది. ఇందులో ఎంజైమ్‌లు లేకపోయినా బైలిరూబిన్ బైలివర్టిన్ అనే వర్ణకాలు కలిగి ఉండి, కొవ్వుల విశ్లేషణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియతో పాటు విసర్జనతో పాటు కొవ్వుల సంశ్లేషణలో ముఖ్య పాత్రపోషిస్తుంది. కాలేయానికి వచ్చే చాలా సమస్యలను మందులతో తగ్గించవచ్చు. కొన్ని రకాల ఇబ్బందులకు మాత్రం ఆపరేషన్ అవసరం అయ్యే సమస్యల్ని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. కాలేయంలో నీటి బుడగలు, కాలేయానికి అనుబంధంగా ఉండే బైల్ గొట్టాలు, గాల్ బ్లాడర్ వంటి భాగాల్లో రాళ్లు ఏర్పడడం, కాలేయంలో కణితులు, లివర్ ట్రామా ముఖ్యమైనవి.

-కాలేయంలో నీటి బుగ్గలు - పుట్టుకతోటే కొందరికి నీటి బుగ్గలు వస్తాయి. ఇవి చిన్నవిగా ఉండి 1,2 ఉంటాయి. పాలీసిస్టిక్ లివర్ డిసీజెస్ అనే వ్యాధిలో మాత్రం అనేక నీటి బుగ్గలు ఉంటాయి. ఈ రెండు సందర్భాలకు పుట్టుకతో వచ్చే జన్యులోపాలు కారణం కావచ్చు. కొన్నిసార్లు మాత్రం పరాన్న జీవుల ఇన్‌ఫెక్షన్‌తో నీటి బుగ్గలు ఏర్పడుతాయి. మరి కొన్ని సందర్భాల్లో చీము గడ్డలు నీటి బుగ్గల మాదిరిగా కనిపిస్తాయి. కాలేయంతో పాటు ఉంటే బైల్ గొట్టాలు, గాల్ బ్లాడర్‌లలో రాళ్లు ఏర్పడడం... కొంత మందిలో ఈ బైల్ గొట్టాలు, గాల్ బ్లాడర్‌లలో రాళ్లు ఏర్పడటాన్ని గమనించవచ్చు. చాఆ సార్లు ఇన్‌ఫెక్షన్ ఇందుకు కారణంగా నిలుస్తుంది. కొలెస్ట్రాల్ పెరగటం, అధికబరువు, షుగర్ వ్యాధి పెరగటంతో పాటు కొన్ని హెల్మింథియల్ ఇన్‌ఫెక్షన్‌లు కారణంగా కావచ్చును. కొన్ని సందర్భాల్లో మాత్రం బైల్ గొట్టాలు వెడల్పుగా ఉండటం వల్ల కొలెడికియల్ సిస్టులు ఏర్పడుతాయి. ఈ ఇబ్బందిలోనూ బైల్‌గొట్టాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. మరికొన్ని సార్లు పుట్టుకతో వచ్చిన వాపుతో వస్తుంటాయి.

-కాలేయంలో కణితులు- కాలేయంలో అవాంచిత కణజాల పేరుకొని పోయి కణితులుగా మారుతాయి. చాలా సందర్భాల్లో ఈ కణితుల్లో కాన్సర్ కణితులు కాకపోవచ్చును. ఉదాహారణకు హిమాంజియా, హెపాటిక్ అడినోమా వంటివి. కొన్ని సందర్భాల్లో మాత్రం క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. సాధారణ కాలేయ క్యాన్సర్‌ను హెపటో సెల్యూలార్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రధానంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకొనే వారిలో ఏర్పడుతుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్‌తో ఏర్పడవచ్చు.కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లో క్యాన్సర్ కనిపిస్తుంది. దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు. కొంత మందిలో జీర్ణవ్యవస్థలోని ఇతర భాగాల్లో లేదా ఇతర శరీరభాగాల్లో క్యాన్సర్ జనించి కాలేయంలోకి పాకవచ్చు. వీటిని లివర్ సెకండరీస్ అంటారు.
-లివర్ ట్రామా- అనుకోని కారణాలతో లేదా రోడ్ ప్రమాదాల్లో కాలేయానికి గాయం తగలవచ్చు. ఈ ట్రామాకు ఆపరేషన్‌తో చక్కటి పరిష్కారం చూపవచ్చు. కాలేయ సమస్యల్ని కచ్చితంగా గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ పరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించాలి. వ్యాధిని సరిగ్గా గుర్తించేందుకు ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ వంటివి అవసరం. ఎండోస్కోపీ, సీరమ్ అల్ఫా ప్రొటీన్ టెస్టుల వంటివి చెయాల్సి రావచ్చు.

ఇబ్బంది తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కాలేయ అనుబంధ ప్రాంతాల్లో రాళ్లు ఉంటే ఎండోస్కోపీ చికిత్సతో తొలగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రాళ్లను లిథోట్రిప్సీ ద్వారా కరిగించవచ్చు. మిగిలిన సందర్భాల్లో ఆపరేషన్ అవసరం కావచ్చు. లాపరోస్కోపీ విధానాలతో నీటి బుగ్గలు, కణితులను తొలగించవచ్చు. ఆపరేషన్‌లలో శరీర భాగంలో పెద్ద గాటు పెట్టడంతో అధికంగా రక్తస్రావం అయ్యేది. ఇతర శరీర భాగాలు డిస్టర్బ్ అయ్యేది. ఇన్‌ఫెక్షన్ కూడా సోకేది. ఇలాంటి సమస్యలన్నీంటిని అధిగమిస్తూ లాపరోస్కోపీ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో చాలా వరకు శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా రక్తం నష్టపోవాల్సిన అవసరం ఉండదు.

RVR


గాయం కూడా పెద్దదిగా ఉండదు కాబట్టి త్వరగా రంధ్రాలు పూడుకొని పోతాయి. దీంతో ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. తక్కువ వ్యవధిలో తిరిగి ఇంటికి వెళ్లి పోవచ్చు. పైగా కొద్ది రోజుల్లోనే తన రోజువారీ పనులు చేసుకోనేందుకు వీలవుతుంది. ఇన్‌ఫెక్షన్ల బెడద కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది సమర్థవంతం అనుకోవచ్చు. వ్యాధి ముదిరిన దశలో లేదా ఇతర కారణాల రీత్యా అవసరాన్ని బట్టి ఓపెన్ సర్జరీ, హెపటెక్టమీ చేయించాల్సి రావచ్చు.

2232
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles