కారుతో పాటు సొంతింట్లోకి..


Fri,August 31, 2018 11:21 PM

-ఎస్‌బీఐ కార్నివాల్ 2018
news
దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ.. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఎస్‌బీఐ కార్నివాల్‌ను నిర్వహిస్తోంది. హైటెక్స్‌లో నేడూ, రేపూ హోమ్, ఆటో ఎక్స్‌పో నిర్వహిస్తోంది. నగరంలో నిర్మితమవుతున్న పలు నివాస సముదాయాలు, హైదరాబాద్‌లో లభించే లగ్జరీ కార్లను రెండు రోజుల కార్నివాల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అపర్ణా గ్రూప్, ఫినీక్స్ గ్రూప్‌లతో పాటు అనేక నిర్మాణ సంస్థలు పాల్గొంటున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో నిర్మితమవుతున్న గృహ సముదాయాల సమాచారాన్ని ప్రతిఒక్కరూ సులువుగా తెలుసుకోవచ్చు. కేవలం ఇండ్లే కాకుండా.. పలు పేరెన్నిక గల లగ్జరీ కార్లను ప్రదర్శిస్తున్నారు. మారుతీ సుజుకీ, నెక్సా, హ్యుందయ్, హోండా, మహీంద్రా, మెర్సిడీజ్- బెంజ్.. ఇలా అనేక కార్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనలునలుండీ.. తగిన ఆదాయం, గృహరుణానికి అర్హత ఉంటే చాలు.. కారుతో బాటు సొంతింట్లోకి అడుగుపెట్టే సౌకర్యాన్ని ఎస్‌బీఐ కల్పిస్తోంది.

ఎస్‌బీఐ అనుమతి పొందిన ప్రస్తుత ప్రాజెక్టులే కాకుండా కొత్తగా చేపట్టే నిర్మాణాల వివరాలను ఈ కార్నివాల్‌లో తెలుసుకోవచ్చు. ప్రాజెక్టు నచ్చితే అక్కడే గృహరుణం కూడా మంజూరు చేస్తారు. ప్రదర్శనకు విచ్చేసేవారికి ఉచితంగా సిబిల్ వివరాల్ని కూడా తెలియజేస్తున్న్తారు. యాభై సంస్థలు చేపడుతున్న రెండు వందల ప్రాజెక్టుల సమాచారాన్ని ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ స్వామినాథన్ తెలిపారు. రెరా ప్రారంభమయ్యాక హైదరాబాద్ రియల్ రంగం మరింత పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. రియల్ రంగానికి ఎస్‌బీఐ పూర్తి స్థాయి సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు.

702
Tags

More News

VIRAL NEWS