కాన్ఫిడెన్షియల్ మోడ్ వాడుతున్నారా?


Tue,July 24, 2018 11:35 PM

యూజర్ల భద్రత కోసం జీమెయిల్‌సెక్యురిటీ ఫీచర్స్‌ను అందుబాటులో ఉంచింది. వాటిల్లో ముఖ్యమైనదిగా భావిస్తున్న కాన్ఫిడెన్షియల్ మోడ్‌లో లోపాలు ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ తెలిపింది.
gmaill
జీమెయిల్ ఇటీవల సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నది. తమ వినియోగదారుల కోసం స్కూజ్, స్మార్ట్ రిైప్లె, కాన్ఫిడెన్షియల్ మోడ్ వంటి భద్రతా పరమైన ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. అయితే, వీటిల్లో కాన్ఫిడెన్షియల్ మోడ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం ఆధార్, బ్యాంక్ వివరాలతో పాటు, ఇతర రహస్యాలను ఈ ఫీచర్ ద్వారా ఇతరులకు పంపుకునే అవకాశం ఉన్నది. వాటిని డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయం లేదు కాబట్టి.. దీని ద్వారా మెరుగైన భద్రత లభిస్తుందని అనుకుంటున్నారు. అయితే, ఇలా పంపే మెయిల్స్‌ను జీమెయిల్‌కు కాకుండా.. ఇతర మెయిల్స్‌కు పంపితే.. హ్యాకర్ల నుంచి ముప్పు తప్పదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలా పంపిన మెయిల్‌ను యాక్సెస్ చేసేందుకు ఒక లింక్‌ను క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసే సమయంలోనే నేరగాళ్లకు దొరికే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే కొన్ని నిజమైన సోర్స్‌లా కనిపించే కొన్ని పేజీలను నేరగాళ్లు రూపొందించే ప్రమాదం ఉంది. దీని ద్వారా కాన్ఫిడెన్షియల్ మెయిల్స్‌లా కనిపించే ఫేక్ మెయిల్స్‌తో అసలైన కాన్ఫిడెన్షియల్ మెయిల్‌లో ఉన్న సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉన్నదని అంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు మరిన్ని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌ను రూపొందిస్తున్నట్లు గూగుల్ ప్రతినిధి బ్రూక్స్ హోకాగ్ చెబుతున్నారు.

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles