కవలల గ్రామం


Sat,July 28, 2018 11:52 PM

kodinhi-village
దేశంలో వేల గ్రామాలు ఉన్నాయి. కానీ, కేరళలోని మలపురం జిల్లాలో కొదిని మాత్రం వెరీ వెరీ స్పెషల్‌గా ఘనత వహించింది. ఒక్కసారిగా అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించింది. సుమారు 2000 కుటుంబాలు నివాసముంటున్న ఈ గ్రామంలో అంతటి స్పెషాలిటీ ఏముందో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే కవలలకు ఈ ఊరు ఫేమస్. ఇక్కడున్న జనంలో చాలామంది కవలలే కావడం విశేషం. సుమారు 204 మంది (దాదాపు 408 మంది) కవల జంటలు ఇక్కడ కనిస్తాయి . అసలు ఈ ఊరిలో ఇలా జరుగడానికి కారణమేమిటనే దానిపై పరిశోధన చేసినా అంతర్జాతీయ జన్యుశాస్త్ర పరిశోధకులు ఆ మిస్టరీ ఏమిటో కనిపెట్టలేకపోయారు. దేశవ్యాప్తంగా కవలలు పుట్టే సగటు ప్రతి వెయ్యిమందిలో తొమ్మిది మందిగా ఉంటే, ఈ గ్రామంలో మాత్రం ప్రతి వెయ్యిమందిలో 45 మందిగా ఉంటున్నారు. 1949లో పురుడు పోసుకున్న ఈ గ్రామంలో ఎక్కువగా సున్నీ ముస్లిం జనాభా నివాసం ఉంటున్నది. ఇక్కడున్న కవలల్లో సుమారు 79 జంటలు పదేళ్లలోపు వారే ఉన్నారు. అందుకే అత్యధిక కవలలు ఉన్న ఈ గ్రామం అంతర్జాతీయంగా ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ వింతను చూసేందుకు ఔత్సాహికులు వచ్చి వెళ్తుండడంతో ఈ గ్రామం ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయిందట.

710
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles