కళ్లు తిప్పనియ్యని నల్ల కలువలు!


Wed,September 19, 2018 01:42 AM

ఆఫ్రికాలోని నల్ల జాతీయులను అందంగా చూపించే పనిలోపడ్డారు అక్కడి యువ ఫొటోగ్రాఫర్లు. అమెరికాలోని ఆఫ్రికా జాతీయులను మూస ధోరణిలో చిత్రీకరించే విధానానికి స్వస్తి పలికి.. నయా ట్రెండ్‌కు బాటలు వేశారు. దీంతో వారి అందాలను చూసిన నెటిజన్లు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.
Africa
అమెరికాలో నల్లజాతీయులను అందంగా చిత్రీకరించే బాధ్యతను అక్కడి యువఫొటోగ్రాఫర్లు తీసుకున్నారు. గతంలో వారిని ఇంటిపనులు చేసేవారిగా, కూలీలుగా, బానిసలుగా చూపించే క్రమానికి స్వస్తి పలికారు. ప్రకృతిలో ప్రతిదీ అందమైందేనని నినదిస్తూ.. వారి అందాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ ఫొటోలను చూసిన వారంతా అందానికి కాదేదీ అనర్హం అంటున్నారు. దీంతో అక్కడి ఆఫ్రికన్ యువతులు, యువకులు మేం నల్లగానే ఉన్నా.. అందంగా ఉంటాం. చాలా శక్తిశాలులం, మా ఆత్మవిశ్వాసానికి మేమే ప్రతిరూపాలం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నార్త్ కరోలినాలోని విన్‌స్టన్-సాలెమ్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బేల్ అనే మహిళ కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసే మైనార్టీ మహిళ వ్యక్తిగత కథలను పరిశీలించడానికి ఫొటో, వీడియోలను ఉపయోగిస్తున్నాది. తెల్లజాతి మహిళలు ఎక్కువగా ఉండే కార్పొరేట్ కార్యాలయాల్లో వీరికి ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నది. నల్ల జాతీయుల అందాలను చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్లను ఆమె అభినందిస్తున్నారు. తన యూనివర్సిటీ విద్యార్థులతో మంచి ఫొటోషూట్‌లు ఏర్పాటు చేయిస్తున్నది.

1238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles