కర్పూరంతో దృఢంగా!


Sat,November 10, 2018 01:14 AM

ప్రొటీన్ల లోపం, కాలుష్యం కారణంగా జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రసాయన పదార్థాల కంటే ఇంటి చిట్కాలు మేలని పెద్దలు చెబుతుంటారు. అందుకే కర్పూరంతో కొన్ని చిట్కాలు.
haircare
-గుడ్డు తెల్లసొన, కర్పూరం నూనె వేసి రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి మొత్తం జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు దృఢంగా ఉంటుంది.
-కొబ్బరి నూనె, మందార పూలు, కర్పూరం బిళ్లలను వేడి చేయాలి. కర్పూరం కరిగిన తరువాత దించేయాలి. చల్లారాక జుట్టుకు పట్టించాలి. 40 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే జుట్టు దృఢంగా ఉండడమే కాకుండా నునుపుగా తయారవుతుంది.
-ఎసెన్షియల్ ఆయిల్, కర్పూరం నూనె, కొంచెం పెరుగు వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
కర్పూరం నూనె, కొబ్బరి నూనె బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. తరుచూ ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

853
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles