కమ్మని నిద్ర కావాలా..


Sat,July 21, 2018 01:33 AM

Sleep_woman
రోజంతా అలసిన శరీరం మనస్సూ సేదదీరేది పడకటింటిలోనే.. కలతలేని, కమ్మని కలల నిద్ర పొందాలంటే ఫెంగ్‌షుయ్ ఏం చెబుతోంది?

రోజులో ఎక్కువ కాలం మనం గడిపేది పడక గదిలోనే. జీవితంలో మూడో వంతు గడిచేది ఇక్కడే. ఇంత ప్రాముఖ్యం ఉన్న శయనాగారానికి ఎంత మంది ఇవ్వాల్సిన ప్రాధాన్యమిస్తారు చెప్పండి? ఒక పక్కంతా ఆక్రమించే వార్డురోబు, బీరువా.. విడిచిన- కట్టాల్సిన బట్టలు.. పక్క గుడ్డలు.. పుస్తకాలు.. ఇవన్నీ ప్రతికూల శక్తి (నెగిటివ్ ఎనర్జీ)ని ప్రేరేపిస్తాయి. నిద్రనూ ఆరోగ్యాన్ని దూరం చేస్తాయి. పడక గదిని కలల మందిరంగా రూపొందించేందుకు ఫెంగ్‌షుయ్ కొన్ని చిట్కాలను సూచిస్తోంది.

- పడక గది తలుపులు పూర్తిగా తెరుచుకోవాలి. లేకపోతే అవకాశాలకు అడ్డుకట్ట పడుతుంది.
- కిటికీ పక్కనే తలపెట్టుకుని పడుకోవద్దు. కాంతి ప్రసరించని విధంగా కర్టెన్ వేసుకోవాలి.
- ఈ రోజుల్లో అటాచ్డ్ బాత్‌రూములు తప్పనిసరి. ఎప్పుడూ కూడా లావెటరీ సీటును మూసి ఉంచండి. నల్లా, షవర్, నీరు కారని విధంగా బందు చేయండి. మరో ముఖ్య విషయం, ఇంట్లోని బాత్‌రూము తలుపు ఎప్పుడూ మూసే ఉంచాలి.
- ఫ్యాన్ లేదా బెడ్ ల్యాంప్ సరిగ్గా నడినెత్తిన ఉండేలా మంచం అమర్చుకోవద్దు.
- బెడ్‌షీట్‌లు, పిల్లో కవర్లు, కర్టెన్లు లేత, ఆహ్లాదకరమైన రంగుల్లో ఉండటం మంచిది. లేత నిమ్మపండు రంగు (లెమన్ ఎల్లో) అయితే ఉత్తమం.
- ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు ఉండే వైపు కాళ్లు పెట్టి పడుకోవద్దు. అయితే, మంచం మీద నుంచి చూస్తే తలుపు కనబడుతూ ఉండాలి.
- బీమ్ కింద లోరూఫ్ కింద పడుకోవద్దు. పడక గదిలో శ్లాబు వాలుగా ఉండకూడదు. బరువైన వస్తువులపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎక్కువుంటుంది.
- చెక్క మంచాలు ఉత్తమోత్తమం. ఇనుప మంచాలు విద్యుదయాస్కాంత తరంగాలను ఆకర్షిస్తాయి. మనసులో కల్లోలం రేపుతాయి.

- మంచానికి హెడ్ బోర్డు ఉంటే మనసుకు దన్ను ఉన్న భావన కలుగుతుంది. తల పెట్టుకునే వైపు (హెడ్ బోర్డు) గోడకు ఆనుకునేలా చూసుకోవాలి. అలాగని మంచాన్ని గదిలో మూలకు నెట్టవద్దు. రెండు వైపులా ఖాళీ ఉండేలా అమర్చుకోవడం సంతులనానికి తోడ్పడుతుంది.
- బెడ్‌రూములో మీ కుటుంబం అంతా కలిసి ఉన్న ఫోటోలే పెట్టుకోండి. భయంకరమైన పక్షులు, మృగాల చిత్తరువులు కాకుండా పచ్చటి ఉద్యానవనమో లేక ఆహ్లాదకరమైన దృశ్యమో ఉన్న చిత్రపటాలు, పోస్టర్లను అతికించుకోవాలి. ఫెంగ్‌షుయ్ ప్రకారం కాళ్ల వైపు అద్దం పెట్టుకోవడం పెద్ద దోషం. అద్దంలో మంచం కనిపిస్తూ ఉంటే అస్సలు మంచిది కాదని నమ్ముతారు.
- సామాను, ఫర్నీచరు ఎంత తక్కువుంటే అంత మంచిది. ఇరుకు గదుల్లో ప్రతికూల శక్తి చేరి మానసిక అలజడి సృష్టిస్తుంది. ఫెంగ్ (నిజానికి ఫంగ్ అని పలకాలి) అంటే చైనీస్‌లో గాలి అని షుయ్ (ష్వాయ్) అంటే నీరు అని అర్థం. ప్రపంచంలోని అన్ని శక్తులకూ ఈ రెండూ ప్రతీకలుగా ఫెంగ్‌షుయ్ పరిగణిస్తుంది.
- జీవితాన్ని వేధించే సమస్యలకు ప్రకృతి పరంగా ఉన్న ప్రతికూల కారకాలను గుర్తించి వాటిని అడ్డుకోవడమెలాగో ఫెంగ్‌షుయ్ చెబుతుంది.

207
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles