కనువిందు చేసే కాన్కన్


Thu,August 30, 2018 11:04 PM

అమెరికాలోని షికాగో నుంచి ఆరు గంటలు ప్రయాణిస్తే ప్రశాంత వాతావరణంలో చల్లని పిల్ల గాలుల పలకరింపు, సకల వర్ణాలతో కనువిందు చేసే మత్స్యసంపద.. వెరసి ఓ అందమైన దీవి.. అదే కాన్కన్ ఐలాండ్.
kankan
బీచ్‌కు దగ్గరలో ఉండే విల్లా (రెసిడెన్సీ) లో బస చేస్తూ... మరుపురాని విహారానందాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే గొప్ప ఆర్కియాలాజికల్ వండర్‌గా చెప్పబడే షిజెనిట్జా కు ప్రసిద్ధిగాంచిన ప్రదేశం కాన్కన్. ఇది క్రీ.శ.| 490 నాటి కట్టడం. పురాతనకాలం నాటి మాన్ సివిలైజేషన్ కు చెందిన షిజినెట్జా ఓ అద్భుత చారిత్రక ప్రదేశం. ఈ మ్యూజియంలో అందమైన శిల్పాలు, హస్తకళలు ఎంతో రమ్యంగా ఉంటాయి. ఇక్కడ చూడాల్సిన మరో అద్భుత ప్రదేశం షెల్-హ-నేషనల్ పార్క్, నేచురల్ ఎన్విరాన్‌మెంటల్ పార్క్. ఇక్కడి ఆక్వేరియంలో ఎన్నో రకాల రంగు రంగుల చేపలుంటాయి. ఇక్కడ జరిగే డాల్ఫిన్ షో ఎంతో పేరుగాంచింది. అంతేకాదు.. ఇక్కడ డాల్ఫిన్స్‌తో కలిసి ఈత కొట్టవచ్చు. ప్రపంచం మొత్తంలో కేవలం కోజుమెల్‌లో మాత్రమే డాల్ఫిన్స్‌తో స్విమ్ చేయగలిగే అవకాశం లభిస్తుంది. వాటికి ముందే శిక్షణ ఇస్తారు కాబట్టి అవి పర్యాటకులతో ఎంతో స్నేహంగా మెలుగుతాయి.

710
Tags

More News

VIRAL NEWS