కంటి డాక్టర్‌కి కంటి ఆపరేషన్..!


Mon,October 6, 2014 12:48 AM

docస్థలం : అమెరికాలోని టెక్సాస్‌లో హోస్టన్ ప్రాంతంలోని స్లేడ్ అండ్ బేకర్ విజన్ సెంటర్. లేజర్ ట్రీట్‌మెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ.
తేదీ : జూలై 30వ తారీఖు, 2014 సంవత్సరం.
ఆపరేషన్ బల్ల మీద ఉన్నప్పటికీ ఆయనలో ఎటువంటి బెరుకూ, ఆందోళనా లేవు. అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం తన కళ్లకి అద్దాల నుంచి విముక్తి కలిగించబోతున్నదన్న ఆనందం. అన్నింటికీ మించి తనకు గురు సమానుడూ, ప్రపంచానికి మొదటిసారి ఆధునిక కంటి లేజర్ చికిత్సను పరిచయం చేసిన వ్యక్తి చేతిలో తన కళ్లు ఉన్నాయన్న ధీమా.
ఆ పేషెంటు : హైదరాబాద్‌లోని మాక్సివిజన్ అధినేత డాక్టర్ కాసు ప్రసాద రెడ్డి.
ఆయనకు ఆపరేషన్ చేయబోయే డాక్టర్ : డాక్టర్ స్లేడ్.
అందరి కళ్లూ బాగు చేసే కంటి డాక్టర్ కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నాడా అన్న సందేహం కలుగుతుంది కదా... ఆ కథాకమామిషు ఏమిటో చదవండి మరి.

50 ఏళ్ల వయసు రాగానే ప్రతి ఒక్కరికీ కళ్లద్దాలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. కనీసం చత్వారం కోసమైనా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా చిన్న వయసులోనే కూడా అద్దాలతో కుస్తీ పట్టేవాళ్లూ ఉంటారు. కిందకు వంగి ఏదన్నా పనిచేయాలన్నా, ఈత కొట్టాలన్నా.. ఇలా ప్రతి దానికీ కళ్లద్దాలు అడ్డం వస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. క్రీడలు, నాట్యం లాంటి వృత్తుల్లో ఉన్నవారికైతే కళ్లద్దాలు అతి పెద్ద సమస్య అయి కూచుంటుంది. ఇక అందం గురించి శ్రద్ధ పెట్టేవాళ్లకూ ఇదో జటిల సమస్యే అవుతుంది. వీటి బాధ పోయే మార్గం ఉంటే బావుండని చాలాసార్లు అనుకుంటారు.

కొందరు ప్రయత్నిస్తారు. మరికొందరు సర్దుకుపోతారు. ఎన్నో వేల మందికి కళ్లద్దాల నుంచి స్వేచ్ఛను ప్రసాదించిన డాక్టర్ కాసు ప్రసాద రెడ్డి కూడా అలాగే అనుకున్నారు. కొన్నాళ్లు సర్దుకుపోయారు కూడా. కాని ప్రతిరోజూ మైక్రోస్కోప్ ద్వారా పేషెంట్ల కళ్లను పరిశీలించినప్పుడల్లా తొందరగా ఈ కళ్లద్దాలను వదుల్చుకోవాలి అనుకున్నారు. ఎందుకంటే ఇలా పేషెంట్లకళ్లను పరీక్ష చేయడం కోసం రోజుకు 150 సార్లన్నా ఈ కళ్లద్దాలను తీసిపెట్టడం, మళ్లీ పెట్టుకోవడం చేయాల్సి వస్తున్నది. ప్రతిరోజూ గోల్ఫ్ ఆడే అలవాటున్న ఆయనకు అక్కడా ఈ కళ్లజోడు అడ్డమే.

ఆడాలంటే అద్దాలు తీసి పక్కన పెట్టాలి. పెట్టుకోకపోతే బంతి ఎక్కడుందో కనబడదు. దూరంలో ఉన్నవి చూడడానికి +2.0, దగ్గరి వాటికి +4.0 పవర్ ఉన్న కళ్లద్దాలు వాడుతున్నారాయన. తన చేతులతో ఆపరేషన్ చేయించుకుని కళ్లద్దాలు లేకుండా సంతోషపడుతున్న వాళ్లని చూసి తను కూడా కళ్లద్దాలు లేని స్వేచ్ఛను అనుభవించాలని బలంగా అనుకున్నాడాయన.

అనుకోకుండా ఒకరోజు...
సుమారు ఒకటిన్నర నెల క్రితం..
అమెరికన్ యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ ఆఫ్తమాలిక్ సర్జరీ (ఎఇసిఒఎస్) సదస్సుకు వెళ్లారు డాక్టర్ కాసు ప్రసాద రెడ్డి. ఆ సొసైటీ సభ్యుడిగా ఆసియా దేశాలన్నింటిలోనూ ఆయనకు ఒక్కరికే ఆహ్వానం అందింది. సదస్సు మద్యలో బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్ వచ్చింది. కంటి చికిత్సల్లో మొదటిసారి లేసిక్ టెక్నాలజీని పరిచయం చేసిన డాక్టర్ స్టీవ్ స్లేడ్‌తో ముచ్చటిస్తూ తింటున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఆ మాటా.. ఈ మాట... డాక్టర్ ప్రసాద రెడ్డి కళ్లద్దాల పైకి వెళ్లింది.

పుస్తకం చదవాలన్నా, దూరంగా ఉన్న చూడాలన్నా కళ్లద్దాలు తప్పనిసరి అని చెప్పారాయన. దాదాపు లక్ష మందికి పైగా ఆపరేషన్లు చేశావు. నువ్వు కూడా చేయించుకోవచ్చు కదా అన్నాడు డాక్టర్ స్లేడ్. చాలా ఇబ్బందిపడుతున్నాను గాని రైట్ టెక్నాలజీ, రైట్ డాక్టర్ కోసం చూస్తున్నాను అన్నారు డాక్టర్ ప్రసాద్ రెడ్డి. మన హాస్పిటల్‌లోనే రేపు చేసేద్దాం అన్నారాయన. అంతే మరుసటి రోజు ఆపరేషన్ అయిపోయింది.

ఆపరేషన్ తరువాత...
అద్భుతం! ఆయన కళ్లద్దాలు లేకుండానే దూరం, దగ్గరి వస్తువులన్నీ స్పష్టంగా చూడగలుగుతున్నారు. కళ్లద్దాలు లేకుండా చూడగలగడంలో ఇంత ఆనందం ఉందా...? ఆపరేషన్ తరువాత తన పేషెంట్లు పొందే ఆనందం స్వయంగా ఆయన అనుభవంలోకి వచ్చింది. ఆపరేషన్ అయిన తరువాతి రోజే వాకింగ్‌కి వెళ్లగలిగారు. డాక్టర్ స్లేడ్‌తో కలిసి చాలా సౌకర్యంగా గోల్ఫ్ కూడా ఆడారు. ఆరో రోజు తిరిగి తన ఆసుపత్రికి వచ్చి, తన పేషెంట్లకు ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టాడు. మొదటి రెండు రోజులు కొంచెం నెమ్మదిగా చేశాడు. ఆ తరువాత ఊపందుకుంది. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎడమ కన్నులో కొంచెం గ్లేర్ కనిపించింది గాని అది డ్రైవింగ్‌పై ప్రభావం ఏమీ చూపలేదు.

డాక్టర్ స్టీవెన్‌నే ఎందుకు ఎంచుకున్నాడంటే..
కంటి ఆపరేషన్ చేసినప్పుడు మొదటిసారే బాగా చేయాలి. ఇతర ఆపరేషన్ల లాగా కాదు. విమానంలో ప్రయాణం చేయడం, గోల్ఫ్ ఆడడం, కంటి సర్జరీలు ఒకటే అంటారు ప్రసాద రెడ్డి. అందుకే కంటి ఆపరేషన్‌లో జరిగే పొరపాట్లు క్షమార్హం కాదని ఆయన అభిప్రాయం. అందువల్లనే ఆపరేషన్ చేయించుకోవడానికి సర్జన్‌ను ఎంచుకోవడం చాలా కీలకం. తన కళ్లకు ఆపరేషన్ చేయడానికి తన కొలీగ్స్‌ని ఒత్తిడికి గురిచేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు.

డాక్టర్ స్లేడ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సర్జన్లలో ఒకరు. ఆయన అడుగుజాడల్లోనే డాక్టర్ రెడ్డి భారతదేశంలో ఈ టెక్నిక్స్‌ను పరిచయం చేశాడు. అంతేగాక మంచి స్నేహితుడిగా ఆయన పట్ల విశ్వాసమున్న వ్యక్తి. డాక్టర్ పట్ల నమ్మకం ఉండడమే అన్నింటికన్నా మంచి మందు కదా. అందుకే ఎన్నోరోజులుగా తన ఆపరేషన్ పట్ల స్పష్టత లేని ఆయనకు డాక్టర్ స్లేడ్ జరిగిన చిన్న ముచ్చట ఒక నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది.

డాక్టరే కాదు.. టెక్నాలజీ కూడా గట్టిదే..!
కాంటాక్ట్ లెన్స్.. లేసిక్.. ఐఒఎల్.. దృష్టిలోపాలను సవరించి, కళ్లద్దాలను దూరం చేయడానికి ఎన్నో రకాల చికిత్సలను అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి ఎంచుకున్న ఆధునిక టెక్నిక్ ఫేకోటెక్‌మిక్స్. మొన్నటివరకు లేజర్ చికిత్స, లేసిక్ లేదా వేరే లెన్సును అమర్చడం ద్వారా కళ్లజోడు నుంచి విముక్తి కల్పిస్తున్నది అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు వీటన్నింటి కన్నా ముందంజలో ఉన్నది ఫేకోటెక్‌మిక్స్ ఇలాంటి 5రకాల టెక్నాలజీలను మిళితం చేసి రూపొందించిన చికిత్స ఇది.
1. ఫెమ్టోసెకండ్ లేజర్ : ఆపరేషన్ గది బయటే కచ్చితమైన ఆపరేటివ్ స్టెప్స్
2. ఎంఐసిఎస్ : లెన్సును ఎమల్సిఫై చేయడానికి కంటిలోకి ప్రవేశించే మార్గం
3. వేవ్‌టెక్ ఓరా : ఆపరేటింగ్ టేబుల్‌పై సరైన ఐఓఎల్ పవర్‌ను లెక్కించడానికి
4. ప్రీమియం ఐఓఎల్ : ఇవి మోనోఫోకల్, మల్టీఫోకల్, అకామడేటివ్ లేదా టోరిక్ ఐఓఎల్ ఉంటాయి.
5. లేసిక్ : రెండు నెలల తరువాత మిగిలిన పవర్ ఏమన్నా ఉంటే ట్రీట్ చేయడానికి.
ఈ సాంకేతిక పరిజ్ఞానాలను మిళితం చేసి కన్నులోని లెన్సు స్థానంలో కృత్రిమ లెన్సును అమర్చడాన్నే ఫేకోటెక్‌మిక్స్ అంటారు. అంటే టెక్నాలజీ మిక్చర్ అన్నమాట.

nurమొదట ఐఓఎల్ (ఇంట్రా ఆక్యులర్ లెన్స్) ద్వారా కృత్రిమ లెన్సు అమర్చారు. ఈ ఐఓఎల్ అనేది మోనోఫోకల్ (కేవలం దూరంగా ఉన్నవి మాత్రమే చూడడానికి) లేదా మల్టీఫోకల్ (బైఫోకల్ -దూరం, దగ్గరగా ఉన్నవి రెండూ చూడగలిగేవి)గా ఉంటాయి. కుడికన్నులో మల్టీఫోకల్ ఐఓఎల్‌ను ఎడమ కంటిలో మోనోఫోకల్ ఐఓఎల్‌ను అమర్చాడు డాక్టర్ స్లేడ్. దీన్నే మిక్స్ అండ్ మ్యాచ్ టెక్నిక్ అంటారు. మొదటి 4 టెక్నిక్స్ ద్వారానే కళ్లద్దాలు లేకుండా చూడగలిగేలా చేయగలిగాడు డాక్టర్ స్లేడ్.


రిస్కులు.. పరిష్కారం..!
-ఇన్‌ఫెక్షన్లు 0.001 శాతం
-లెన్స్ రిజెక్షన్ 0.001 శాతం
-వాపు 1 శాతం ఉండే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ఇబ్బందులన్నింటికీ పరిష్కారం ఉంది. మందులు, చుక్కల మందులు వాడడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చు.కళ్లద్దాలు తీసేయాలంటే అదేదో అందానికి సంబంధించింది అనుకుంటారు చాలామంది. అయితే కళ్లద్దాలు పెట్టుకున్నవాళ్లకే వాటి బాధ ఏంటో అర్థం అవుతుంది. మానసికమైన బిడియాలు మాత్రమే కాదు కొన్ని వృత్తుల్లో వారికి ఇదో గుదిబండ. క్రీడాకారులు, డ్యాన్సర్లకు చాలా కష్టం. పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇదో అడ్డంకి అవుతుంది. ఈ కళ్లద్దాలు ముక్కు పైన శాశ్వతమైన మచ్చను ఏర్పరుస్తాయి. కళ్లద్దాలు ఉన్నవాళ్లందరూ అవి లేకుండా ఉండాలనే కోరుకుంటారు. చాలామంది పేషెంట్లు ఇంట్రావర్ట్‌గా ఉన్నవాళ్లు కళ్లద్దాల బాధ పోయిన తరువాత ఎక్స్‌ట్రావర్ట్‌గా మారడం చూశాను.

అంటే లేసిక్ లేదా లెన్స్ ద్వారా కళ్లద్దాల నుంచి విముక్తి పొందడం వల్ల వాళ్ల వ్యక్తిత్వమే మారిపోయింది. వృత్తిపరంగా గాని, వ్యక్తిగతంగా గాని కళ్లద్దాల వల్ల నాకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించాలని నేనూ అనుకున్నాను. కాకపోతే సరైన టెక్నాలజీ, సరైన డాక్టర్ కోసం ఇన్నాళ్లూ వేచి చూశాను. ఇకపోతే ఆపరేషన్ వల్ల రిస్కు...! దుష్ప్రభావాలు లేని ఆపరేషన్ అంటూ ఏదీ ఉండదు. చిన్న కంటి ఆపరేషన్ అయినా సరే మసగ్గా కనిపించడం లాంటి సమస్యలు రావచ్చు. కాని ఇలా రిస్కుల గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రతిరోజూ రోడ్డు కూడా దాటలేం. దీని సక్సెస్ రేటు 99.9 శాతం కేవలం 0.1 శాతం రిస్కు గురించి ఆలోచించి కళ్లద్దాలు లేకుండా స్పష్టంగా చూడగలిగే అవకాశాన్ని వదులుకోవడం సరి కాదు కదా.

సురక్షితమైన ఫేకోటెక్‌మిక్స్!
పాతరోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. ఆధునిక చికిత్సలు లేవు. కంటికి ఆపరేషన్ చేయాలంటే సవాలక్ష విషయాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. ఆపరేషన్ చేస్తే విజయవంతం అవుతుందన్న నమ్మకం లేదు. సక్సెస్ రేటు చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో కాటరాక్ట్ ముదిరేవరకు వేచి చూడడమే మంచిదని అనుకునేవారు. ముదిరిన తరువాత ఆపరేషన్ సక్సెస్ అయితే చూపు వస్తుంది. ఒకవేళ సక్సెస్ కాకపోయినా పోయేదేమీ లేదు. కాటరాక్ట్ వల్ల చూపు పోవాల్సిందే. ముదిరిన తరువాత ఆపరేషన్ రిస్క్ అయినా జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అందుకని ముదిరే వరకు కాటరాక్ట్ ఆపరేషన్ చేసేవాళ్లు కాదు.

శుక్లాలను గ్రేడ్ 1, 2, 3, 4, 5 గా విభజించి చూసినట్టయితే, తొలి రోజుల్ల్లో చివరి దశ (5వ గ్రేడ్) వరకు చేయని ఆపరేషన్‌ను ఆ తరువాత 3వ దశలోనే చేయడం ఆరంభించారు. ఇప్పుడు మొదటి దశలోనే నిస్సంకోచంగా ఆపరేషన్ చేయగలుగుతున్నారు. ఇందుకు కారణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సర్జరీని సురక్షితం చేయడం. కళ్లద్దాలను వదిలించుకోవడం కోసమే నేను ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ఫేకోటెక్‌మిక్స్ వల్ల నాకు ఇంకో మేలు కూడా జరిగింది. జీవితంలో ఒక వయసు తరువాత ఏదో ఒక దశలో కంటిలో శుక్లం వస్తుంది. కాని నాకు మాత్రం అది వచ్చే అవకాశమే లేదు.

ఎందుకంటే నా కంట్లో సహజమైన లెన్సే లేదు. కృత్రిమ లెన్సుకి వయసు పెరగడమూ ఉండదు, శుక్లం రావడమూ ఉండదు. అంతేకాదు.. దృష్టిలోపాలే కాకుండా లెన్సుకు సంబంధించిన ఎటువంటి సమస్యలూ ఇక రావు. అయితే రెటీనాకు సంబంధించిన సమస్యలు వయసురీత్యా వచ్చే వాటికి ఇది పరిష్కారం కాదు. ఈ సమస్యల్ని కూడా శాశ్వతంగా తొలగించడానికి పరిశోధనలు
జరుగుతున్నాయి.

ఇక నాకు శుక్లం రాదు..!
కళ్లద్దాలు తీసేయాలంటే అదేదో అందానికి సంబంధించింది అనుకుంటారు చాలామంది. అయితే కళ్లద్దాలు పెట్టుకున్నవాళ్లకే వాటి బాధ ఏంటో అర్థం అవుతుంది. మానసికమైన బిడియాలు మాత్రమే కాదు కొన్ని వృత్తుల్లో వారికి ఇదో గుదిబండ. క్రీడాకారులు, డ్యాన్సర్లకు చాలా కష్టం. పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇదో అడ్డంకి అవుతుంది. ఈ కళ్లద్దాలు ముక్కు పైన శాశ్వతమైన మచ్చను ఏర్పరుస్తాయి. కళ్లద్దాలు ఉన్నవాళ్లందరూ అవి లేకుండా ఉండాలనే కోరుకుంటారు. చాలామంది పేషెంట్లు ఇంట్రావర్ట్‌గా ఉన్నవాళ్లు కళ్లద్దాల బాధ పోయిన తరువాత ఎక్స్‌ట్రావర్ట్‌గా మారడం చూశాను.

అంటే లేసిక్ లేదా లెన్స్ ద్వారా కళ్లద్దాల నుంచి విముక్తి పొందడం వల్ల వాళ్ల వ్యక్తిత్వమే మారిపోయింది. వృత్తిపరంగా గాని, వ్యక్తిగతంగా గాని కళ్లద్దాల వల్ల నాకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించాలని నేనూ అనుకున్నాను. కాకపోతే సరైన టెక్నాలజీ, సరైన డాక్టర్ కోసం ఇన్నాళ్లూ వేచి చూశాను. ఇకపోతే ఆపరేషన్ వల్ల రిస్కు...! దుష్ప్రభావాలు లేని ఆపరేషన్ అంటూ ఏదీ ఉండదు. చిన్న కంటి ఆపరేషన్ అయినా సరే మసగ్గా కనిపించడం లాంటి సమస్యలు రావచ్చు. కాని ఇలా రిస్కుల గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రతిరోజూ రోడ్డు కూడా దాటలేం. దీని సక్సెస్ రేటు 99.9 శాతం కేవలం 0.1 శాతం రిస్కు గురించి ఆలోచించి కళ్లద్దాలు లేకుండా స్పష్టంగా చూడగలిగే అవకాశాన్ని వదులుకోవడం సరి కాదు కదా.

1200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles