ఓజోన్ పొరను కాపాడుకుందాం!


Sat,September 15, 2018 11:28 PM

భూమ్మీద నివసించే మానవాళిని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుతుంటుంది ఓజోన్ పొర. అయితే, పర్యావరణ కాలుష్యం వల్ల ఆ ఓజోన్ పొరకు చిల్లుపడుతున్నది. దాని వల్ల మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. భవిష్యత్‌లో మరెన్నో ఎదుర్కోవాలి కూడా. నేడు ఓజోన్ డే సందర్భంగా పర్యావరణాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడే పద్ధతుల గురించి తెలుసుకుందాం.
ozone-day
భూమ్మీద వాతావరణ కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు 1995 నుంచి సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నారు. ఓజోన్ పొరకు చిల్లుపడితే, భవిష్యత్తులో ప్రమాదంగా మారవచ్చునని 1980లోనే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణంలో విడుదలవుతున్న వివిధ రసాయనాల మూలంగా ఓజోన్ పొరకు చిల్లుబడుతున్నట్లు నిర్ధారణయింది. ఓజోన్ పొరకు చిల్లుబడడం వల్ల అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమ్మీద పడి మానవ జాతికే ముప్పు తెస్తున్నాయి. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది క్యాన్సర్ భారిన పడతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఓజోన్ పొరను నియంత్రించే ఎఫ్‌సీ, సీటీసీ మిథేల్ క్లోరోఫారం, మిథేల్ బ్రొమైడ్, హెచ్‌సీఎఫ్‌సీ వంటి పదార్థాల తయారీని నియంత్రించేందుకు మన దేశం ముందడుగు వేసింది. ఓజోన్ పొరను కాపాడుకోవాలంటే చెట్లను అధికంగా పెంచాలి. పొరను దెబ్బతీసే కాలుష్యాన్ని తగ్గించాలి. ఓజోన్ పొర లేకుంటే జరిగే దుష్ఫలితాల ప్రజలలో అవగాహన కల్పించాలి. అప్పుడే ఓజోన్ పొరను మనం కాపాడుకోగలం. దీనిని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.

1407
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles