ఒడిదుడుకుల్లోనూ సిప్ బెటర్


Sat,July 21, 2018 01:42 AM

Plant
డిస్కౌంట్లు ప్రకటిస్తే ఇస్తే గాడ్జెట్లు, విడిభాగాలు ఎగబడి కొనుగోలు చేసే సాధారణ జనం..అదే స్టాక్ మార్కెట్లు 10-15 శాతం పడిపోతే షేర్ల వైపు కన్నెత్తి కూడా చూడరు. నిజానికి మార్కెట్ పతనం అయిన సమయంలోనే పెట్టుబడులు పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ మదుపరులు సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్(సిప్) తగ్గించుకుంటున్నారు. ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. సిప్‌ల నుంచి పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోవడం లేదా మదుపు మొత్తాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ద్వారా సిప్‌లలో ఇన్వెస్టర్లు నెలలో నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రీటైల్ ఇన్వెస్టర్లకు ఇది అనువైన పద్ధతి కూడా. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సిప్‌లు మ్యూచువల్ ఫండ్లలో రూ.6,690 కోట్ల పెట్టుబడులు పెట్టగా, అదే మార్చి నెలలో రూ.7,110 కోట్లుగా ఉన్నాయి.

జనవరి 2014 నుంచి సిప్‌ల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రముఖ ఇన్వెస్టర్ నేహా మెహతా ఇటీవల వీటి నుంచి వైదొలిగారు. మార్కెట్లు గరిష్ఠ స్థాయిలో ఉండటం వల్లనే వెనక్కి తగ్గినట్లు ఆమె చెప్పారు. మరికొంత మంది పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నదని, ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్లలో మదుపు చేసిన వారికి ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నదని అన్నారు. స్వల్పకాలంలో సరాసరి రిటర్నులపై పలువురు పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నిజానికి సిప్ పద్దతిలో మదుపు చేయడం ద్వారా మార్కెట్‌లో ఏది సరైన సమయం అని ఆలోచించాల్సి అవసరముండదు. అలాగే మార్కెట్ గరిష్ఠ స్థాయిలోనూ, కనిష్ఠ స్థాయిలోనూ మదుపు చేస్తారు కనుక సగటు ధరలో మదుపు ఉంటుంది. గరిష్ఠ స్థాయిలో తక్కువ యూనిట్లు, కనిష్ఠ స్థాయిలో ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తారు కనుక దీని ప్రయోజనం దీర్ఘకాలంలో కనిపిస్తుంది. ఈ కారణంగానే సిప్ రాబడుల విషయంలో ఆశావహ దృక్ఫథం నెలకొనడం విశేషం. సిప్‌లో ఏ సమయంలోనైనా పెట్టుబడులు పెట్టగలగడం అతిపెద్ద ప్రయోజనం.
Mutual-Fund

దీర్ఘకాల పెట్టుబడులకు మేలు

సిప్‌లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడితేనే అధిక రాబడులు వస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఉదాహరణకు 22 ఏండ్లపాటు ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీం(ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్లలో రూ.33 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినవారికి కనీసంగా రూ.1.85 కోట్లు గరిష్ఠంగా రూ.9 కోట్ల వరకు లభించాయి. ఒకవేళ మార్కెట్లు పడిపోతే పెట్టుబడులు పెట్టిన ఒక్క స్టాక్ గురించి తెలుసుకుంటే సరిపోతున్నది. మిగతా షేర్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ పోర్టుఫోలియోలో 30-50 షేర్లు ఉంటాయి. ఈ తేడాను ఇన్వెస్టర్లు గుర్తించాలి. ఇటీవల పరిమితంగానే అయినా సిప్‌ల్లో రిడెంప్షన్ ఒత్తిడిని ఎదుర్కొవడం ఆశ్చర్యానికి గురి కావాల్సి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Mutual-Fund

పెట్టుబడులపై వెనక్కి తగ్గొద్దు..

మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగినప్పటికీ పెట్టుబడులపై వెనుకంజ వేయకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్లు పతనం అవుతున్న సమయంలో కూడా సిప్ పెట్టుబడులను కొనసాగించాలి. అలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా మేలైన రాబడులు వస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది మార్చి నుంచి సిప్‌ల్లో పెట్టుబడులను నిలిపివేసిన వారు తక్కువ ఎన్‌ఏవీ ఉన్న ఫండ్లలో పెట్టుబడి అవకాశాలను ఇప్పటికే కోల్పోయారని పర్సనల్ ఫైనాన్షియల్ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. అనుభవం కలిగిన పెట్టుబడిదారులు కూడా ఒకసమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున భవిష్యత్తులో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులకు ఇంతకు మించిన మంచి సమయంలేదు. ద్రవ్యోల్బణం 5-6 శాతం మధ్యలో నిలకడగా ఉంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఒక్క శాతం రిటర్నులు మాత్రమే నికరంగా రావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచితే పొదుపుపై వడ్డీలు మరింత పెరుగుతాయి. దీంతో మదుపరులకు లబ్ది చేకూరనుందన్న అభిప్రాయంలో చాలా మంది ఉంటారు. కానీ, నిజానికి స్థిరాదాయ సాధానల్లో రాబడి ద్రవ్యోల్భణం, పన్నులను పరిగణనలోకి తీసుకుంటే దాదాపుగా లేదు. దీర్ఘకాలానికి ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఏటా సగటున నికరంగా 15-16 శాతం వరకు రాబడి వచ్చింది. షేర్లలో నేరుగా పెట్టుబడులు కాకుండా పరోక్షంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్(సిప్) పద్దతిని ఎంచుకుంటే బెటర్. మీరు ట్రేడర్ కాదు. ఇన్వెస్టర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

395
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles