ఒంటరి ప్రయాణాలు..


Thu,May 18, 2017 11:32 PM

ఒకప్పుడు భారతీయ మహిళ ఎక్కడికైనా టూర్‌కి వెళ్లాలంటే.. అది ఓ ఆధ్యాత్మిక కేంద్రానికో కుటుంబంతో కలిసి వెళ్లేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
solo
టెక్నాలజీ మాత్రమే కాదు.. దాంతో పోటీ ఆలోచనల తీరు కూడా వేగంగా మారుతున్నది. ఆధ్యాత్మిక యాత్రలు, ఫ్యామిలీ టూర్లకు టాటా చెప్పేసి సాహసయాత్రలు, మారథాన్లు, సైక్లింగ్, బైక్‌రైడింగ్, పర్వతాధిరోహణ వంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటి మహిళలు. ఒంటరిగా ప్రయాణించడమంటే మా ఆత్మైస్థెర్యాన్ని ప్రకటించుకోవడం, మా స్వేచ్ఛను అనుభవించడం అంటున్నారు. ట్రిప్ అడ్వైజర్ అనే ఓ ట్రావెలింగ్ సంస్థ చేపట్టిన సర్వేలో 2014లో 37 శాతం మంది మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తే 2015 నాటికి ఆ సంఖ్య 41 శాతానికి పెరిగింది. ఈ సర్వేలో భాగంగా 47 శాతం మంది మహిళలు ఒంటరిగా ప్రయాణించడం ద్వారా స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టుగా భావిస్తున్నాం అని చెప్తే, 39 శాతం మంది మహిళలు ఒంటరి ప్రయాణాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇలా ఒంటరి ప్రయాణాలు చేస్తున్న సమయంలోనే వారి అభిప్రాయాలను, అనుభవాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మహిళల ఒంటరి సాహస యాత్రలను ప్రోత్సహిస్తూ కొన్ని ట్రావెలింగ్ సంస్థలు, ఎన్జీవోలు ఆఫర్లు, ఉచిత సేవలు, హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

482
Tags

More News

VIRAL NEWS