ఐరన్ అవసరమెంత?


Sun,October 1, 2017 11:41 PM

నా వయసు 23 సంవత్సరాలు. పోయిన సంవత్సరం నాకు పెళ్లయ్యింది. ఇప్పుడు మూడోనెల గర్భవతిగా ఉన్నాను. గర్భవతులకు ఎక్కువ ఐరన్ అవసరం ఉంటుందని ఎక్కడో చదివాను. ఇందుకోసం నేను ఏం చెయ్యాలి? పూర్తి వివరాలు తెలియజేయగలరు.
విశాల, వికారాబాద్
iron
మీ శరీరంలో మీకు సరిపడినంత ఐరన్ ఉండాలి. ఇది కండరాలకు, మెదడుకు, గుండెకు శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలన్నింటికీ ఆక్సిజన్ అందించడంలో ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. తగినంత ఐరన్ శరీరంలో లేకపోతే అలసటగా, నీరసంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా మాంసాహారంలో లివర్, గుడ్డు, చేపలు వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇక శాఖాహారంలో పాలకూర వంటి ఆకుకూరలు, బ్రకోలీ, మొలకెత్తిన గింజలు, చిక్కుళ్లు, బఠాణీలు, సోయా వంటి వాటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్, ద్రాక్ష, పుచ్చపండు, వంటి పండ్లలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. డ్రైఫ్రూట్స్ కూడా ఐరన్ కోసం తీసుకోవచ్చు.
andalreddy

351
Tags

More News

VIRAL NEWS