ఐబీఎస్‌కు హోమియో బెస్ట్


Wed,June 21, 2017 01:40 AM

poliyo
మానవ జీర్ణవ్యవస్థను మ్యాజిక్ బాక్స్ అంటారు. కడుపు నొప్పికి కారణాలు అనేకం. ఇది ఎందువల్ల వస్తుందో నిర్ధారించడం కష్టం. దీర్ఘకాలికంగా కడుపునొప్పి, విరేచనాలు వేధిస్తున్నాయంటే పేగుల్లో ఇబ్బందికర మార్పులేవో ఇందుకు కారణం కావచ్చు. ముఖ్యంగా పేగుల్లో పూత, వాపు వల్ల ఇటువంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ సమస్యలను ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ అంటారు.

ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ ఆహార నాళాలకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య. మన శరీరంలో జీర్ణాశయానికి లోపలి వైపున అనేక మ్యూకోసిల్ పొరలు ఉంటాయి. ఇవి వాపు, మంట, తాపానికి గురి కావడాన్ని ఇన్‌ఫ్లమేషన్ అని అంటారు. ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులెవరిలోనైనా సమానంగా కనిపిస్తుంది. సాధారణంగా 30 సంవత్సరాల లోపు వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

కారణాలు

జన్యుపరమైన సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ పొరపాటున జీర్ణవ్యవస్థ పై దాడి చెయ్యడం, కుటుంబ చరిత్ర, కాలుష్యం, పొగతాగడం వంటివి ప్రధాన కారణాలు.ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ రెండు రకాలుగా ఉంటుంది.

-అల్సరేటివ్ కోలైటిస్ - చాలా వరకు ఈ సమస్య పెద్దపేగుకు మాత్రమే పరిమితం అవుతుంది. పెద్దపేగుకు లోపల వైపుగా ఉండే మ్యూకోసిల్ పొరలు ఎర్రగా మారి, వాపునకి గురి కావడం, పుండ్లు ఏర్పడడం వల్ల విరేచనాలు, కొందరిలో రక్తంతో కూడిన విరేచనాలు మలవిసర్జనలో ఆత్రుత, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.

-క్రౌన్స్ డిసీజ్- ఈ సమస్య జీర్ణవ్యవస్థ అనగా నోటి నుంచి మొదలుకొని మలద్వారం వరకు ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చిన్నపేగు చివరి భాగంలో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది కేవలం పైన ఉండే మ్యూకోసిల్ పొరలకు మాత్రమే కాకుండా లోపల ఉండే అన్ని పొరలకు ఇన్‌ఫ్లమేషన్ వ్యాపిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా విరేచనాలు, కడుపులో నొప్పి, మెలితిప్పినట్టు ఉండడం, రక్తంతో కూడిన విరేచనాలు ప్రధానంగా ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే చిన్న పేగు మూసుకుపోవడం, పుండ్లు ఏర్పడడం, పేగులో రంధ్రాలు ఏర్పడటం, ఫిస్టులా వంటి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. ఫలితంగా రక్తహీనత, నీరసం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
-ఐబీఎస్ కేవలం జీర్ణవ్యవస్థకే కాకుండా కీళ్లు, చర్మం, కాలేయం, కళ్లు వంటి అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది.

పరీక్షలు

రోగి లక్షణాలను బట్టి రక్త పరీక్ష, మల పరీక్ష, కొలనోస్కోపి, సిగ్మాయిడోస్కోపి, ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎండోస్కోపీ వంటి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించడమే కాకుండా ఇతర జీర్ణవ్యవస్థ సంబంధించిన సమస్యలు కూడా నిర్ధారించడం జరుగుతుంది.
mohan

హోమియో చికిత్స

జెనెటిక్ కాన్స్‌టిట్యూషనల్ సిమిలియం ద్వారా ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ వల్ల దీర్ఘకాలికంగా వచ్చే కడుపునొప్పి విరేచనాలు ఇతర లక్షణాలను తగ్గించడమే కాకుండా ఐబీఎస్ కి గల కారణాలను ముఖ్యంగా వికటించిన రోగనిరోధక వ్యవస్థను చికిత్స ద్వారా సరిచేసి ఈ సమస్యను, శాశ్వతంగా దూరం చేయవచ్చు.హోమియోకేర్‌లో వైద్యం ద్వారా ఐబీఎస్ సమస్యతో బాధపడుతున్న వారిలో సుమారు 82 శాతం మందిలో మంచి ఫలితాలు కనిపించాయి.

407
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles