ఐదుగురు అమ్మాయిలు.. అవార్డు గెలిచారు!


Thu,May 18, 2017 11:34 PM

ఎదుటివారి కష్టాన్ని చూసి చలించేవాళ్లు చాలామందే ఉండొచ్చు. కానీ, ఉన్నంతలో ఎంతో కొంత సాయం చేసే గొప్ప మనసు కొందరికే ఉంటుంది. అలాంటి మనసున్న ఐదుగురు అమ్మాయిలు చేసిన మంచిపని ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటున్నది.
girls
వాళ్లు గుజరాత్‌లోని మాతృఛాయ కన్య విద్యాలయం విద్యార్థినులు. రోజూ స్కూల్‌కి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు రోడ్డు పక్కన, ఫుట్‌పాత్ మీద పడుకునే వారిని చూసి చలించిపోయారు. వీరికి ఏదైనా సాయం చేద్దాం అనుకున్నారు ఆ ఐదుగురు అమ్మాయిలు. వాళ్లే యాత్రి పతక్, సౌమ్య మెహతా, సుహానీ షా, కేశ్వి భట్, విధి థాకర్. ఫీల్ - ఇమాజిన్ - డూ - షేర్ అనే కాన్సెప్ట్‌తో డిజైన్ ఫర్ ఛేంజ్ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో వైశాలి హెచ్. షా గైడెన్స్‌తో ఈ ఐదుగురు అమ్మాయిలు ఓ అద్భుతం చేశారు. చిన్న చిన్న గుడిసెలు, బెడ్స్, బెడ్‌షీట్ ఇలా ఎన్నో తయారుచేశారు. ఒకరు చెత్తగా భావించే చెత్త ఇంకొకరికి అవసరం తీర్చే వస్తువు అనే కాన్సెప్ట్‌తో గూనీ బ్యాగ్స్‌లో పాత న్యూస్‌పేపర్స్ నింపి, బియ్యం సంచులను కుట్టి మెత్తటి పరుపులు, దిండ్లు తయారుచేశారు. అలా తయారుచేసిన వస్తువులను రోడ్డు పక్కన నివసించే వారికి, అనాథలకు, యాచకులకు పంచారు. ఈ పిల్లలు చేసిన పని క్విక్ ఇంపాక్ట్ అవార్డు, ఐ కెన్‌లాంటి అవార్డులు గెలుచుకుంది. దేశంలో 78 మిలియన్ల మంది ఇళ్లులేని వారున్నారు. వారందరికీ కనీసం వసతులు కల్పించడం మన బాధ్యత అంటున్నారు ఈ విద్యార్థినులు.

426
Tags

More News

VIRAL NEWS