ఏ పండులో.. ఎంత చక్కెర?


Mon,December 17, 2018 10:29 PM

మధుమేహం కామన్ డిసీజ్ అయిపోయింది. అందుకే చాలామంది పండ్లు తినరు. షుగర్ లెస్ చాయ్ దొరుకుతుంది కానీ.. షుగర్‌లెస్ ఫ్రూట్స్ దొరకవు కదా. అందుకే ఏ పండులో ఎంత చక్కెర శాతం ఉందో తెలుసుకుంటే వాటి మోతాదును బట్టి తినొచ్చో లేదో ఒక అవగాహన ఏర్పరచుకోవచ్చు.
Orange
ఆరెంజ్: ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రుచిగా కూడా ఉంటాయి. 100 మిల్లీ లీటర్ల ఆరెంజ్ జ్యూస్‌లో 8.4 గ్రాముల చక్కెర ఉంటుంది.
Apple
యాపిల్: రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లూ సూచి స్తుంటారు. యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ సాల్యుబుల్ ఫైబర్ ఆరోగ్యానికి మంచిది. 100 మిల్లీ లీటర్ల యాపిల్ జ్యూస్‌లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది.

ద్రాక్ష: శరీరానికి అవసరమైన ఐరన్, కాపర్, మెగ్నీషి యం ఖనిజాలు ద్రాక్షలో ఉంటాయి. 100 మిల్లీ లీటర్ల ద్రాక్ష జ్యూస్‌లో 14.2 గ్రాముల చక్కెర ఉంటుంది.


దానిమ్మ: ఇది చక్కని ఔషధ ఫలం. 100 మిల్లీ లీటర్ల దానిమ్మ జ్యూస్‌లో 12.65 గ్రాముల చక్కెర ఉంటుంది.


అరటి: ఐరన్ పుష్కలంగా లభించే పండ్లు అరటి పండ్లు. అజీర్ణ సమస్యను కూడా ఇవి తగ్గిస్తాయి. ఒక అరటి పండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది.


అవకాడో: మెదడు పనితీరును, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో అవకాడో ఔషధంగా పనిచేస్తుంది. ఇందు లో చక్కెర తక్కువగా ఉంటుంది. ఒక అవకాడోలో కేవలం 1 గ్రాము చక్కెర మాత్రమే ఉంటుంది.


స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.


చెర్రీ: నేరేడు జాతికి చెందిన చెర్రీ పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కెమికల్ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఒక కప్పు చెర్రీస్‌లో 19 గ్రాముల చక్కెర ఉంటుంది.


జామ: ఈ పండ్లు తినడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర ఉంటుంది.

625
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles