ఏటీఎం పిన్ మర్చిపోయారా?


Tue,July 31, 2018 11:15 PM

atm
ఏటీఎం పిన్ మర్చిపోయి, అర్జంటుగా డబ్బులు డ్రా చేయాల్సివచ్చినప్పుడు కొత్త పిన్ జనరేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం అకౌంట్ నంబర్‌తో లింక్ చేసుకున్న మొబైల్ నంబర్ కచ్చితంగా మీతో పాటు ఉండాలి. ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టిన వెంటనే బ్యాంకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పిన్ చేంజ్, లేదా ఏటీఎం పిన్ రీసెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సెలక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్‌కి వన్‌టైమ్ పాస్‌వర్డ్ మెసేజ్ వస్తుంది. ఆ పిన్ నంబర్ ఎంటర్ చేసి, కొత్త పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. అంతే.. మీ ఏటీఎం కార్డుకు కొత్త పిన్ సెట్ అయిపోతుంది.

514
Tags

More News

VIRAL NEWS