ఏకాంతం ప్రమాదమే


Tue,May 7, 2019 01:02 AM

పోటీ ప్రపంచంలో ఒకరిపై ఒకరికి ద్వేషం.. స్వార్థం.. అసూయ ఎక్కువగా కనిస్తాయి. అందరూ ఈ సముదాయంలో ఇమడలేరు. ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడుతుంటారు కొందరు. అయితే ఈ ఏకాంత జీవితం ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
Living-Alone
ఒంటరితనం వల్ల ప్రపంచానికి దూరంగా ఉండి హాయిగా బతకొచ్చు అనుకుంటారు. కానీ దానివల్ల మానసికంగా బలహీనులయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఫ్రాన్స్ పరిశోధకులు. ఏకాంత జీవితం గురించి తాజాగా ఓ పరిశోధన జరిపారు. 16-64 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు 20,500 మందిపై సుదీర్గ పరిశీలనలు చేశారు. ఏకాంత జీవితం ప్రశాంతంగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ దానివల్ల విపరీత ఆలోచనలకు ఆస్కారం ఉంటుంది. దీనివల్ల అవసరం లేని విషయాల గురించి క్రమం తప్పిన ఆలోచనలు చేస్తుంటారు. ఇది క్రమంగా అలవాటుగా మారి మెదడుకు పనితీరులో మార్పు వస్తుంది. అప్పటికే ఏదైనా మానసిక రుగ్మత ఉన్నవారికైతే ఏకంగా మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏకాంతం తాత్కాలికంగా ప్రశాంతతను కలిగించినట్లే కనిపించినప్పటికీ శాశ్వత జీవిత ప్రయోజనాల దృష్ట్యా అది ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

224
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles