ఎసిడిటీకి హోమియో చికిత్స


Tue,April 18, 2017 12:28 AM

ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే దానినే ఎసిడిటీ అంటారు. ఇది జబ్బు కాదు. జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట, పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాలల్లో ఉంటే ఈ సమస్య రాదు.
acidity
జీర్ణాశయంలో జఠర గ్రంధులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది ఎక్కువైనప్పుడు ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది.సాధారణంగా మనం తీసుకునే ఆహారలోపం వల్ల గానీ జీవన విధానంలో మార్పుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ సమస్య భోజనప్రియులలో చూస్తుంటాము. ఏది పడితే అది ఎక్కడపడితే అక్కడ తినేవారిలో ఈ సమస్య అధికం. ఎడిసిటీ ఉన్నవారిలో ఛాతిలోను, గొంతులోను, గుండెలోను, జీర్ణాశయంలోను మంటగా ఉంటుంది. పుల్లటి తేన్పులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లు, కడుపు ఉబ్బరంగానూ, వాంతి వచ్చినట్లు ఉంటుంది. మలబద్ధకంగా, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.

కారణాలు..


-ఆల్కాహాల్, పొగతాగడం, గుట్కాలాంటి పదార్థాలు తీసుకోవటం
-మానసిక ఆందోళన
-ఫాస్ట్‌ఫుడ్, మసాలా ఎక్కువగా తీసుకునే వారిలో
-ఆహారాన్ని నియమిత సమయంలో త్వరత్వరగా తీసుకోవటం
-తగిన విశ్రాంతి లేకపోవటం

జాగ్రత్తలు..


- పులుపు పదార్థాలు తీసుకోకూడదు.
-వేళకు భోజనం చేయాలి. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.
-కొవ్వు పదార్థాలు కూడా మితంగా తీసుకోవాలి.
-తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
-రోజుకు 6-8 గ్లాసుల నీళ్లు తాగాలి.
reddy

హోమియో చికిత్సా విధానం..


ఎసిడిటీ మందులు దీర్ఘకాలం వాడకూడదు. అజీర్ణం, పుల్లటి తేన్పులు, మంట వంటివి తరచుగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఎక్కువగా వృద్ధుల్లో చూస్తూ ఉంటాం. ఈ సమస్యకు సంబంధించి పాజిటివ్ హోమియోపతిలో చాలా అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం అనే వైద్య విధానం ద్వారా ఎంపిక చేసిన మందుల వల్ల ఎన్నో ఆశ్చర్యకర ఫలితాలను చూస్తున్నాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సురక్షితమైన చికిత్స పాజిటివ్ హోమియోపతి అందుబాటులో ఉన్నది.

808
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles