ఎవరు ఎంతసేపు నిద్రించాలి?


Mon,April 15, 2019 11:11 PM

పిల్లలకు ఎండాకాలం సెలవులు వచ్చేశాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు ఒకటే ఆటలు. కనీసం తినే తీరిక కూడా లేకుండా కనిపిస్తున్నారు. పిల్లల కోసం ఇప్పటిదాకా పేరెంట్స్ తక్కువ సమయం నిద్రపోయేవాళ్లు.. ఇప్పుడు హాలిడేస్ వల్ల పిల్లల వంతు వచ్చేసింది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఏ సమయంలో నిద్రపోతున్నారు? ఎంత సమయం నిద్రిస్తున్నారు?
sleep-guidelines-kids
ఆరోగ్యసూత్రాల్లో నిద్ర కూడా ఒకటి. ఎంత బాగా నిద్రపోతే అంత మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. రాత్రిళ్లు వీలైనంత త్వరగా పడుకోవాలి. ఉదయం త్వరగా మేల్కొనాలి. ఇది ఒక అలవాటుగా ఏర్పరచుకోవాలి. ఈ క్రమపద్ధతి లేకపోవడం వల్లే చాలామంది మధుమేహం.. బీపీ.. హృద్రోగాలకు గురవుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. నిర్దిష్ట సమయంలో పడుకొని.. మేల్కొనే వారితో పోలిస్తే నిద్రా సమయం పాటించని వాళ్లలో మధుమేహం.. ఊబకాయం.. బీపీ.. హృద్రోగ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. వయసును బట్టి ఏయే వేళల్లో ఎంతసేపు నిద్రపోవాలో ఒకసారి చూద్దాం.
అప్పుడే పుట్టిన పసిపాప నుంచి 3 నెలల వరకు రోజుకు 14-17 గంటల నిద్ర అవసరం.

-4-11 నెలల వయసున్న పిల్లలు కనీసం రోజులో 12-15 గంటలు నిద్రపోవాలి.

-1- 2 సంవత్సరాల వయస్సున్న పిల్లలు రోజుకు 11-14 గంటలు నిద్రపోవాలి.

-3-5 సంవత్సరాల వయసు పిల్లలు 10-13 గంటలు నిద్రపోవాలి.

-6-13 ఏండ్ల పిల్లలు 9-11 గంటలు నిద్ర పోవాలి.

-14-17 ఏండ్ల వయసు పిల్లలకు రోజులో 8-10 గంటల నిద్ర అవసరం.

-18-64 సంవత్సరాల వయసు గలవారు 7-9 గంటలు నిద్రపోవాలి.

-65 ఏండ్ల పైబడిన వాళ్లు రోజులో 7-8 గంటల పాటు నిద్రపోవాలి.

159
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles