ఎలుకలు.. సాలెపురుగులా..?!


Wed,August 8, 2018 01:05 AM

చాలామందికి ఎలుకలు.. సాలెపురుగులంటే భయం వేస్తుంది. అవి ఇంక ఇంట్లో తిరుగుతున్నాయంటే పరుగులు పెట్టేస్తారేమో! అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. వాటి బారి నుంచి రక్షించుకునేందుకు ఇవి పాటించండి.
rat
-ఒక గిన్నెలో వేడి నీరు తీసుకొని అందులో మూడు, నాలుగు టీ బ్యాగ్‌లను వేసి మరిగించాలి. ఈ వాసనకు సాలీడులు, ఎలుకలు దూరంగా పారిపోతాయి. ఎంత ఘాటైన వాసన టీ సంచులు వేస్తే అంత మంచింది. ఈ టీ సంచులను గది మూలల్లో ఉంచాలి. ఆరేడు గంటలపాటు వాటిని కదుపకుండా ఉంచాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే ఇంక వాటి బెడద ఉండదు.
-బిర్యానీకి ఘుమఘుమలాడే వాసన రావాలంటే బిర్యానీ ఆకు పడాల్సిందే! ఇవే ఆకులు ఎలుకల, సాలెపురుగుల భరతం పట్టడంలోనూ పనిచేస్తాయి. వీటిని చిన్నగా కత్తిరించి ఇవి ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పెడితే సరిపోతుంది.
-ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించే మార్గాన్ని కనిపిడితే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అవి ప్రవేశించే ద్వారం వద్ద మింట్ టూత్‌పేస్ట్‌ని పెట్టండి. సాలెపురుగుల కోసం ఇంటిమూలల్లో, తలుపులు, కిటికీల వద్ద ఈ పేస్ట్ రాస్తే అవి ఇంటి నుంచి బయటకు పరుగులు తీస్తాయి.
-సాలెగూళ్లు.. ఎలుకలు తిరిగే ప్రాంతాల్లో కాస్త బేకింగ్ సోడా చల్లి చూడండి. దీనితో అవి ఇంట్లోకి రావడానికి సాహసించవు. పైగా బేకింగ్ సోడాను ఆ తర్వాత శుభ్రం చేసుకోవడం కూడా సులువే!

374
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles