ఎలాగంటే?


Mon,August 27, 2018 11:15 PM

Elaagante
మేఘాలు ఏర్పడే విధానంలో అత్యంత సూక్ష్మమైన సాంకేతికత దాగి ఉంటుంది. గాలి, మేఘాలు నీటి బిందువులు అన్నీ కలిసి ఆకాశంలో కూడటాన్ని వాతావరణంగా పిలుస్తాం. ఇంకా శాస్త్రీయంగా చెప్పాలంటే, ముందు మేఘం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. భూమిమీది నీరు వేడిమికి ఆవిరై గాలిలో కలుస్తుంది. నీటి ఆవిరి పైకి పోయే కొద్దీ చల్లబడుతుంటుంది. ఆవిరి రూపంలోని తేమనే సూక్ష్మమైన నీటి బిందువులుగా మారుతుంది. ఇవి గాలికన్నా తేలికగా ఉండటంతో ఆకాశంలో తేలియాడుతూ ఉంటాయి. వీటి సముదాయమే మేఘం. ఈ మేఘాలు గాలితోపాటు కదులుతూ మరీ బాగా చల్లబడినప్పుడు తిరిగి నీటి బిందువులుగా మారి వర్షంగా కురుస్తుంది.

137
Tags

More News

VIRAL NEWS