ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


Tue,April 18, 2017 11:44 PM

మా పాప వయసు 10 సంవత్సరాలు. తరచుగా కడుపు నొప్పి అంటుంది. ఒకసారి మూత్రంలో రక్తం కూడా పడింది. పరీక్షలు చేయిస్తే కుడివైపు కిడ్నీలో చిన్న రాయి ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. మూత్రంలో కాల్షియం కూడా పోతున్నట్టుగా చెప్పారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రాఘవేంద్ర, హైదరాబాద్
baby
మూత్రంలో కాల్షియం పోవడాన్ని హైపర్‌కాల్షియూరియా అంటారు. అంటే మూత్రంలో మోతాదుకు మించి కాల్షియం పోతుందని అర్థం. ఈ సమస్య 5-8 శాతం పిల్లల్లో కనిపిస్తుంది. ఇది కిడ్నీలో రాళ్ల సమస్య రావడానికి ఉండే కారణాల్లో అత్యంత సాధారణమైనది. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
-రోజువారీ ఆహారంలో కాల్షియం 400-800 ఎంజి/డి మించకుండా జాగ్రత్త పడాలి.
-చాక్లెట్లు, గింజలు, కాఫీ, కోలా పానీయాలు, ఆకుకూరల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కూడా తగ్గించి ఇవ్వాలి.
-జంతు సంబంధమైన ప్రొటీన్, మాంసాహారం ఇవ్వకూడదు.
-ఆహారంలో ఉప్పు తగ్గించాలి. చక్కెర కూడా వీలైనంత తగ్గించాలి.

-పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. ఇవి ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ఓట్స్ వంటి వాటిల్లో లభిస్తాయి.
-ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి.
మీ పాప విషయంలో పై జాగ్రత్తలన్నీ పాటిస్తూ చికిత్స తీసుకుంటే త్వరలోనే సమస్య తగ్గిపోతుంది.
డాక్టర్ సత్య ప్రసాద్
కన్సల్టెంట్ పిడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్
రెయిన్‌బో చిల్డ్రెన్స్ హాస్పిహాస్పిటల్స్
హైదరాబాద్

734
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles