ఎయిర్ ప్యూరిఫైర్


Tue,August 7, 2018 11:16 PM

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛమైన గాలి కావాలంటే ఏ అడవిలోకో, పల్లెటూరికో వెళ్లాల్సిందే. అక్కడ మాత్రమే కలుషితం కాని గాలి దొరుకుతుంది. అయితే.. డైసన్ ప్యూర్ కూల్ అనే డివైజ్ మీ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది.
air-purifier
మనకు మొన్నటి వరకు వాటర్ ప్యూరిఫైర్స్ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మనిషి లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాక సౌకర్యాల దశ దాటిపోయి.. విలాస జీవితాన్ని గడుపడానికే మొగ్గు చూపుతున్నాడు. ఆ దశలో పుట్టినవే ప్రస్తుతం మనం చూస్తున్న గాడ్జెట్స్. బ్రిటీష్ టెక్నాలజీ కంపెనీకి చెందిన డైసన్ అనే కంపెనీ ఈ ఎయిర్ ప్యూరిఫైర్ గాడ్జెట్‌ని తయారుచేసింది. ఇది ఇంట్లోని గాలిని ఫిల్టర్ చేస్తుంది. 360 డిగ్రీల కోణంలో ఈ ప్యూరిఫైర్ గాలిని స్వచ్ఛ పరుచగలదు. క్వాలిటీ సెన్సార్ యాప్ సహాయంతో ఈ ప్యూరిఫైర్ పనిచేస్తుంది. ఈ గాడ్జెట్‌కి ముందుభాగంలో డిస్‌ప్లే ఉంటుంది. అందులో గాలి స్వచ్ఛత శాతం కనిపిస్తుంది. ఆ డిస్‌ప్లేలో లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటే గాలి పూర్తిగా స్వచ్ఛంగా ఉన్నట్టు, పసుపు రంగులో ఉంటే ఇంప్రూవ్ చేయడానికి వీలున్నట్టు, ఎరుపు లేదా కాషాయ రంగులో ఉంటే పూర్తిగా కలుషితమైన గాలి అక్కడ ఉన్నట్టు డిస్‌ప్లే సెన్సర్‌లో తెలుస్తుంది.

613
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles