ఎకో ఫ్రెండ్లీ డైపర్!


Fri,August 10, 2018 12:54 AM

చిన్నారులకు డైపర్లు ఇప్పడు తప్పనిసరి అయ్యాయి. మార్కెట్‌లో ఉన్న వాటిల్లో చిన్నపిల్లలు ఒకట్రెండుసార్లు విసర్జన చేయగానే దానిని తీసి వేరేది మార్చాల్చి వస్తుంది. పతిసారి మార్చడం కూడా కష్టమే. చెన్నైకి చెందిన శాస్త్రవేత్తలు కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డైపర్‌ను రూపొందించారు. దాని ప్రత్యేకతలివి..
eco-friendly
చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కి చెందిన పరిశోధకులు ఎక్కువ శాతం నీటిని పీల్చుకునేలా కొత్త డైపర్స్‌ను తయారు చేశారు. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి. వాటికి చకౌర్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డైపర్లు.. పిల్లలు రెండుమూడు సార్లు మూత్ర విసర్జన చేయగానే పాడైపోతుంటాయి. వాటికి మరలా తిరిగి పీల్చుకొనే కెపాసిటీ ఉండదు. తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ శాతం నీటిని పీల్చుకునే డైపర్స్‌ను సముద్రపు వ్యర్థాలతో తయారు చేశారు. ఈ ఎకో ఫ్రెండ్లీ డైపర్ 1250 గ్రాముల నీటిని పీల్చుకుంటుంది. ఇందులోని జిగురు, ఫోరస్ కొంత సమయం తరువాత పొడిగా మార్చుతాయి. తర్వాత మళ్లీ దీన్ని వినియోగించవచ్చు. ఇలా దాదాపు 8సార్లు ఉపయోగించొచ్చు. ముందుగా ఈ ప్రయోగాన్ని కుండీలో చిన్న మిరప మొక్కమీద ప్రయోగించారు. ఐదు రోజులకొకసారి నీరు పోసి ఎంత నీటిని పీల్చుకుంటుందో పరిశీలించారు. మొక్క మీద చేసిన ప్రయోగం విజయవంతం అవడంతో ఈ సూపర్ డైపర్‌ను తయారు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇవి త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి.

240
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles