ఎండాకాలం.. బీపీ ముప్పు


Mon,April 15, 2019 11:12 PM

హై బీపీ ఉన్నవాళ్లకు చిరాకు.. ఆందోళన.. కోపం ఉండడం మామూలే. దీనికి ఎండాకాలం తోడైతే.. అది రెట్టింపయ్యే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఇది ఒక రకంగా ఒత్తిడిని ప్రేరేపిస్తూనే మరో రకంగా దానికి అనుబంధంగా మరిన్ని రోగాల బారిన పడేసే ప్రమాదం ఉంది.
dizziness
హైబీపీకి.. అధిక బరువుకు అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే చాలా అధ్యయనాల్లో హైబీపీ ఉన్నవారు అధిక బరువున్నవారు అని తేలింది. కాబట్టి ముందుగా వయసుకు.. ఎత్తుకు మించి శరీర బరువు ఉన్నవారు బరువు తగ్గాలి. బీఎంఐ 20-25 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. బీఎంఐ 25 దాటితే హైబీపీ రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించి హైబీపీ లేకుండా చూసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల గుండె కండరాలు దృఢంగా మారి హైబీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. హైబీపీ ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నీరసంగా ఉంటుంది. చూపు కాస్త మసగ్గా ఉంటుంది. ఛాతిలో నొప్పి వస్తుంది. తీవ్ర ఆందోళన.. గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం.. తలనొప్పి.. ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

147
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles