ఎండలో వెళ్తున్నారా?


Tue,February 26, 2019 01:17 AM

ఎండలు వాటి పని అవి చేస్తాయి. భయపడి ఇంట్లో ఉంటే పనులు కావు కదా. అందుకే మన పని మనం చేయాలి. ఎండ నుంచి తప్పించుకొని వడదెబ్బ తగులకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Sun-Stroke
-బయటకి వెళ్లినపుడు వాటర్ బాటిల్‌ను తీసుకువెళ్లాలి.
-వీలైనంత వరకు చల్లని ప్రదేశాలలో ఉండడానికి ప్రయత్నించాలి.
-ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
-ఎండలోకి వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
-పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తగినంత తాగాలి.
-రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
-వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలి.
-ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్లు వాడాలి.
-తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి.
-ఆల్కహాల్, సిగరెట్, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
-ముఖ్యంగా పసిపిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.
-ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి.
-పిల్లలకు లేతరంగుల్లోని పలుచని బట్టలు వేయాలి.

250
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles