ఊరెళ్తున్నారా?


Sat,December 8, 2018 02:29 AM

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఊరెళ్లేటప్పుడు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
-ఊరు వెళ్లేటప్పుడు టెలిఫోన్ రింగ్ శబ్ధాన్ని తగ్గించండి. ఊరు వెళ్తున్నట్లు ఇంటి బయట ఎవరికీ చెప్పకూడదు.

safty
-ఇంట్లో ఉండే పనిముట్లు, నిచ్చెనలు అలాంటివి బయట పెట్టకండి. అవి ఉండడం వల్ల దొంగలకు బాగా ఉపయోగపడుతాయి.
-కొత్త సెక్యూరిటీ గార్డ్‌ను పెట్టినప్పుడు అతని పూర్తి వివరాలు కుటుంబసభ్యులందరూ తెలుసుకోవాలి.
-మెయిన్ డోర్‌కు గట్టి తాళం వేయండి. అన్ని వైపులా ఉండే తలుపులు వేశారో లేదో గమనించాలి. అన్ని వస్తువులు లోపల పెట్టుకోవాలి.
-ఇంటి తాళంచెవులు మెట్ల కిందగాని, ఎవరికీ తెలియని ప్రదేశంలోగానీ భద్రపరుచుకోవాలి. వెంట తీసుకెళ్తే మరీ మంచిది.
-న్యూస్‌పేపర్ వంటివి ఇంటి ముందు ఎక్కువసేపు ఉంచకుండా పక్కింటివారిని తీసెయ్యమని చెప్పాలి. అత్యంత అవసరం ఉంటే ఫోన్ చెయ్యమని చెప్పి నంబర్ ఇవ్వండి.
-ఫర్నీచర్‌కి వచ్చే పెద్ద బాక్స్‌లను బయట పడేయకూడదు.

896
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles