ఉమైద్ ప్యాలెస్


Thu,August 9, 2018 11:10 PM

పర్యాటక రంగంలో... దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఎన్నో రాచరిక వ్యవస్థలకు పుట్టినిల్లయిన రాజస్థాన్‌లో ఆ రాజుల కళాపోషణకు గుర్తుగా వెలసిన చారిత్రక కట్టడం ఉమైద్ ప్యాలెస్ .
umaid-bhawan-palace
వ్యక్తిగత నివాసాల్లో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరొందిన కట్టడాల్లో ఒకటి. ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఉంది. ప్రస్తుతం తాజ్ హోటల్స్ గ్రూప్ ఈ ప్యాలెస్ బాగోగులు చూస్తున్నది. మొత్తం 347 గదులున్న ఈ ప్యాలెస్‌ను జోధ్పూర్ మహారాజు... మహారాజా ఉమైద్ సింగ్ నిర్మించారు. రాజా ఉమైద్ సింగ్ అధికార నివాసంగా ఉన్న ఈ అద్భుత ప్యాలెస్ కు ఆయన ముని మనుమలు ప్రస్తుత యజమానులు. ఈ ప్యాలెస్ చిత్తర్ హిల్స్‌పై నిర్మించినందువల్ల దీని నిర్మాణ సమయంలో చిత్తర్ ప్యాలెస్ అని కూడా పిలిచేవారు. తరువాత రాజా ఉమైద్ సింగ్ పేరు మీద ఉమైద్ భవన్ ప్యాలెస్‌గా నామకరణం చేశారు. చిత్తర్ హిల్, జోధ్‌పూర్‌లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. 1929వ సంవత్సరం నవంబర్ 18న ఈ భవన నిర్మాణాన్ని చేపట్టి 1943లో పూర్తిచేశారు.ఐదు వేల మంది నిర్మాణ కార్మికులు 15 ఏళ్ళపాటు శ్రమకోర్చి దీన్ని నిర్మించారు. నిర్మాణంలో కాంక్రీట్‌కాని, సిమెంట్ గాని వాడకుండా కేవలం రాళ్ళతో నిర్మించడం దీని ప్రత్యేకత.

924
Tags

More News

VIRAL NEWS