ఉప్పునీరు ప్రయోజనాలు


Tue,August 28, 2018 01:22 AM

Face
-సముద్రపు ఉప్పును తీసుకొని నీటిలో కరిగించాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మొటిమలు తొలగిపోయి ముఖం ఆకర్షణీయంగా ఉంటుంది.
-ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల చికాకు తెప్పించే బాక్టీరియాను తొలిగించి చర్మానికి ఉపశమనం కలిగేలా చేస్తుంది. శరీరానికి తగిలిన గాయాలను సులువుగా తగ్గిస్తుంది.
-గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలుపాలి. ఈ నీటిని నోటిలో పోసుకొని ఐదు నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇలా తరచూ చేస్తే నోటి దుర్వాసనను తొలగించుకోవచ్చు.
-నీరు, ఉప్పును బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాలకు నీటితో శుభ్రపరుచుకున్న తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
-సముద్రపు స్నానం చేయడం వల్ల స్ట్రెయిట్‌గా ఉన్న మీ జుట్టును కర్లీగా పొందవచ్చు. ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. రింగుల జుట్టు కావాలంటే ప్రతిరోజూ మీ జట్టుకు ఉప్పునీటిని పట్టించాలి.

367
Tags

More News

VIRAL NEWS

Featured Articles