ఉప్పల్‌లో డీఎస్‌ఎల్ మాల్


Fri,August 17, 2018 11:23 PM

-4.5 ఎకరాల్లో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, ఐటీ బిల్డింగ్

తూర్పు హైదరాబాద్‌లో ఆధునిక షాపింగ్ మాళ్లు, బడా మల్టీప్లెక్సులు లేవనే బెంగ అక్కర్లేదిక. పోచారం, రహేజా, ఎన్‌ఎస్‌ఎల్ వంటి ఐటీ సెజ్జులో పని చేసే ఐటీ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు.. ఇలా ప్రతిఒక్కరికీ నచ్చేలా.. బడా షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్, ఐటీ సముదాయం ఏర్పాటు కానున్నది. ఉప్పల్ స్టేడియం పక్కనే దాదాపు నాలుగున్నర ఎకరాల్లో డీఎస్‌ఎల్ మాల్, డీఎస్‌ఎల్ అబాకస్ సముదాయాల్ని డీఎస్‌ఎల్ సంస్థ అభివృద్ధి చేస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు షాపింగ్ మాల్, మల్టీప్లెక్సులను మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నది. కళ్లు మిరుమిట్లు గొలిపే ఐటీ సముదాయాన్ని నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నది. ఒక్క పార్కింగ్ సౌకర్యాన్నే ఐదు లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేస్తున్నది. ఈ షాపింగ్ మాల్‌ను 2019 జనవరిలో అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ఎండీ మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఐటీ సముదాయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరులో ఆరంభిస్తామని వెల్లడించారు.
Office-Block
మెట్రో రాకతో ఉప్పల్‌కు ఇతర ప్రాంతాల నుంచి కనెక్టివిటీ పెరిగిందని.. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహకర నిర్ణయాల వల్ల తూర్పు హైదరాబాద్ గణనీయంగా వృద్ధి చెందుతోందని ఆయన వివరించారు. తమ లాంటి షాపింగ్ మాళ్లు, ఇతరత్రా భవనాలు దాదాపు పది వరకూ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణం జరుపుకుంటున్నాయని.. దీని వల్ల రానున్న రోజుల్లో తూర్పు హైదరాబాద్‌కి ఎక్కడ్లేని ఆదరణ పెరుగుతుందని చెప్పారు. పశ్చిమ హైదరాబాద్‌తో పోల్చితే, ఇక్కడ రహదారులు వెడల్పుగా ఉంటాయని, ఇండ్ల ధరలూ అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు.

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles