ఉపవాసంలో నీరసం రాకుండా..


Thu,May 24, 2018 01:46 AM

ఈ సంవత్సరం రంజాన్ హాట్ సమ్మర్‌లో వచ్చేసింది. కాసేపు ఉపవాసం ఉన్నా మనకు ఎంతో సమయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో రోజు మొత్తం మీరు ఎలా ఉంటారో అని ఊహించారా? ఏ డైట్ ఫాలో అయితే రోజు మొత్తం నీరసం లేకుండా గడుపుతారో తెలుసుకోండి.
nut
ఉపవాసం ఉన్నప్పుడు శక్తి అనేది మీరు తినే భోజనం నుంచి గ్రహించే గ్లూకోజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే దీని నుంచి పొందే శక్తి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తుంది. మిగతా కొన్ని గంటలు మీరు సరిగ్గా ఉండాలంటే ఒంట్లో సరైన లెవల్‌లో గ్లూకోజ్, కొవ్వు నిల్వలు అనేవి అవసరం. రోజంతా ఉపవాసం ఉండి ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. వెంటనే శరీరానికి కావాల్సిన క్యాలరీలు, న్యూట్రియంట్స్ అంది మీకు తక్షణశక్తి అందుతుంది. కాబట్టి ఉపవాసం ఉండేవాళ్లు మంచి న్యూట్రియంట్, రిచ్ ఫుడ్‌ని తీసుకున్నప్పుడే ఈ రంజాన్ మాసం ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. మిగతా రోజుల్లో డైట్ ఎలా ఫాలో అవుతారో ఈ మాసంలో కూడా పెద్దగా మార్పులు చేయకుండా ఫాలో అయితే మంచిది. తినే ఆహారాన్ని బట్టి డీహైడ్రేషన్ కాకుండా రక్షణ పొందవచ్చు. మీ ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

శక్తి కోసం..


ఎక్కువసేపు శక్తి ఉండేలా ఈ సంవత్సరం ఉపవాసం చేయాలి. కాబట్టి క్వాలిటీ ఫుడ్‌తో పాటు.. క్వాంటిటీ ఫుడ్ కూడా ఆధారపడి ఉంటుంది. రోజంతా ఉపవాసం ఉండాలని ఎక్కువగా తినేస్తారు. ఇది తప్పు. మెల్లగా జీర్ణమయ్యే ఆహారం, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. కార్బొహైడ్రేట్లు అంటే.. గోధుమ బ్రెడ్, రైస్, పాస్తా, ఆలుగడ్డలు ఇలాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే పాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిపేయొచ్చు. ఇవి కాకుండా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చీజ్ స్లయిసెస్, మీట్, కోడిగుడ్లులాంటివి కూడా డైట్‌లో ఉండేలా చూసుకోండి. ఆహారం తినే ముందు కొన్ని ఖర్జూరాలు తిని, పాలు లేదా ఫ్రెష్ జ్యూస్ తాగిన తర్వాత విందు ఆరగిస్తే మంచిది. జ్యూస్ తాగిన తర్వాత వీలైతే సూప్ తాగండి. దీనివల్ల శరీరానికి కావాల్సిన కార్బొహైడ్రేట్లు తక్కువలో ఉన్న రక్తపు చక్కెర స్థాయిలను నార్మల్‌కి తీసుకొస్తుంది. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల రోజంతా మిస్సయిన ఎలక్ట్రోలైట్‌ని, ఫ్లుయిడ్స్‌ని మెయింటెన్ చేయొచ్చు. ఇఫ్తార్‌లో ఒక్కరే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భుజించండి.
డాక్టర్ మయూరి ఆవుల
న్యూట్రిషియనిస్ట్ mayuri.trudiet@gmail.com

1698
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles