ఉత్తమ నిర్మాణ సంస్థలతో.. నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో


Sat,August 11, 2018 12:50 AM

-ఆగస్టు 18, 19 తేదీల్లో
-వేదిక: శిల్పాకళావేదిక

logo_Telugu
హైదరాబాద్‌లో స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటున్నారా? మీ పిల్లల ఉన్నత విద్య, పెళ్లిళ్లకు అక్కరకొచ్చేలా ప్లాటు కొనాలని ఉందా?నగరం నలువైపులా లెక్కకు మించిన వెంచర్లు, అధిక సంఖ్యలో అపార్టుమెంట్లు.. వీటిలో ఏదీ ఎంచుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారా?

ప్లాటు అయినా ఫ్లాటు అయినా.. మీకు అన్నివిధాల నప్పే కలల గృహాన్ని ఎంచుకోవడానికి చేయాల్సిందల్లా ఒక్కటే.. ఆగస్టు 18, 19వ తేదీల్లో శిల్పాకళావేదికలో జరిగే నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోకు విచ్చేయండి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన పేరెన్నిక గల రియల్ సంస్థలు మాత్రమే పాల్గొంటున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు విచ్చేసి ఎంచక్కా నచ్చిన గృహాన్ని ఎంపిక చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. నాలుగు వందల ఏండ్లకు పైగా చరిత్ర గల భాగ్యనగరంలో తమకంటూ సొంత చిరునామా ఉందని సగర్వంగా జీవించండి.

ప్లాటినం స్పాన్సర్‌గా అపర్ణా గ్రూప్ వ్యవహరిస్తున్నది. పవర్డ్ బై: రాంకీ గ్రూప్. ఆదిత్యా కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఈఐపీఎల్, సైబర్ సిటీ డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, వర్టూసా, జనప్రియ ఇంజినీర్స్, సాయిసూర్య డెవలపర్స్, ముప్పా హోమ్స్, వర్టెక్స్ హోమ్స్, ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్, మాతృభూమి డెవలపర్స్, ఆర్క్ ఇన్‌ఫ్రా గ్రూప్, ఆర్‌వీ నిర్మాణ్, ప్రగతి గ్రూప్ తదితర సంస్థలు పాల్గొంటున్నాయి.

257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles