ఈ నొప్పులకు పరిష్కారం ఉందా?


Tue,January 30, 2018 11:47 PM

నా వయసు 52 సంవత్సరాలు. ఎత్తు 5.8 అడుగులు, బరువు 75 కిలోలు. బీపీ, షుగర్ వంటి సమస్యలేమీ లేవు. గత సంవత్సరం నుంచి మోకాళ్లలో నొప్పితో బాధపడుతున్నాను. గత మూడు నెలల నుంచి విపరీతంగా ఉన్నాయి. ఏ మాత్రం నడువాలన్నా, నిలబడి పని చెయ్యాలన్నా నొప్పి ఎక్కువగా ఉంటున్నది. ఉదయం నిద్ర నుంచి లేచినపుడు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యకు హోమియోపతి ద్వారా పరిష్కారం లభిస్తుందా?
- శ్రీపాదరావు, సిరిసిల్ల

kneepain-stock
మీరు చెబుతున్నదాన్ని బట్టి మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్టు అనిపిస్తున్నది. కాల్షియం తగ్గడం, అధిక బరువు, వయసు పైబడడం ఈ వ్యాధికి ముఖ్య కారణాలు. హోమియో వైద్యంలో రస్టాక్ 30 పొటెన్సీలో రోజు మార్చి రోజు ఉదయం పరగడుపున 5 డోసులు వేసుకుంటే గుణం కనిపిస్తుంది. దీనితో పాటు బరువు తగ్గడం, మోకాలి చుట్టూ ఉండే కండరాల పటుత్వం పెంచే వ్యాయామాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాధి లక్షణాలను సంపూర్ణంగా విశ్లేషించి కొన్నాళ్లు వైద్య పర్యవేక్షణలో పూర్తి చికిత్స తీసుకుంటే మంచిది.

డా. శ్రీకాంత్
హోమియో
వైద్య నిపుణులు
శ్రీసాయి హోమియో క్లినిక్
హైదరాబాద్

405
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles