ఈ నొప్పి ఎందుకు?


Thu,January 25, 2018 11:08 PM

నాకు 30 ఏళ్లు. నెల క్రితం కడుపులో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల ఈ నొప్పి వచ్చిందని డాక్టర్ చెప్పారు. మందులు వాడితే తాత్కాలికంగా నొప్పి తగ్గింది. వారం రోజుల నుంచి మళ్లీ నొప్పి వస్తున్నది. అసలీ నొప్పి ఏంటీ? మందులతో తగ్గుతుందా?
- వెంకటేశ్వర్లు, జగిత్యాల

abdominal-pain
మీరు తెలిపిన వివరాల ప్రకారం అక్యూట్ పాంక్రియాటైటిస్ అనేది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గానీ, పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు గానీ వస్తుంది. మరి మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందో.. లేదో చెప్పలేదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయో.. లేవో తెలుపలేదు. కొంతకాలంగా నొప్పి తగ్గి, మళ్లీ రావడం మొదలయిందంటే అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ అయుండవచ్చు. పాంక్రియాటైటిస్ ద్వారా సూడోసిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. మీకు ఆల్కహాల్ అలవాటు ఉన్నట్టయితే వెంటనే మానేయండి. అలా చేయపోతే మళ్లీ మళ్లీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. పాంక్రియాస్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదమూ ఉంది.
bhavani-raju

265
Tags

More News

VIRAL NEWS