ఈ నిబంధనలు ఎందుకు?


Thu,April 20, 2017 11:35 PM

ముస్లిం మహిళలు ముఖం నిండా బురఖా ధరించడంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇదే విషయమై అరబ్ దేశానికి చెందినయువతి, ట్విట్టర్‌లో తన తండ్రితో జరిపిన సంభాషణ అందరినీ ఆకట్టుకున్నది.
hizab
సౌదీకి చెందిన పదిహేడేళ్ల లామ్య యూఎస్‌లోని పెన్సిల్‌వేనియాలో ఉంటుండగా ఆమె తండ్రి స్వదేశంలోనే ఉంటున్నాడు. ప్రెసిడెంట్ ట్రంప్.. రాజకీయ పరిస్థితులు అనే అంశంపై ఇటీవల చర్చించిన బృందంలో లామ్య కూడా సభ్యురాలు. ట్రంప్ తీసుకుంటున్న ముస్లిం వ్యతిరేక నిర్ణయాలను ఆమె ఖండించారు. తన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న బురఖాను తీసేసేందుకు తండ్రి అనుమతి కోరాలనుకుని.. ట్వీట్ చేసింది. బురఖా ఎందుకు ధరించాలి? మాకు ఈ నిబంధనలు ఎందుకు? వాళ్ల శరీరానికి ఏది నచ్చుతుందో అదే వేసుకోనిద్దాం అని ట్వీట్ చేసింది. తండ్రి నుంచి రిప్లయ్ వచ్చింది. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్. ధైర్యంగా ముందుకు వెళ్లు. అది ఎలాంటి అంశమైనా నీకు నేను అండగా ఉంటా అని ధైర్యమిచ్చాడు వాళ్ల నాన్న. తండ్రీ బిడ్డల అనుబంధానికి అద్దం పట్టిన ఈ సంభాషణ అందర్నీ ఆలోచింపజేస్తున్నది.

510
Tags

More News

VIRAL NEWS