ఈ కాలంలోనూ.. ఆస్తమా ప్రభావం!


Tue,March 5, 2019 01:02 AM

ఆస్తమా.. చలికాలంలో ఎక్కువగా సోకుతుంది. పిల్లలను.. వృద్ధులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే.. వేసవిలోనూ ఆస్తమా విజృంభిస్తుంది. ఎలా అంటారా? వాతావరణ కాలుష్యం వల్ల! పొల్యూషన్ ఆస్తమాకు ఏ విధంగా కారణం అవుతుంది? దానికి సొల్యూషన్ ఏంటి? తెలుసుకుందాం.
asthma
1. శ్రీధర్ సేల్స్ రిప్రజెంటేటివ్. వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తుంటాడు. వారం పది రోజులుగా ఊపిరితిత్తుల్లోని నరాల్లో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. పరీక్షలు చేస్తే ఆస్తమా అని నిర్ధారణ అయింది.


2. కల్పన గ్రానైట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్. రోజంతా గ్రానైట్ వాతావరణంలోనే ఉండాలి. కొద్దిరోజులుగా ఆమె అస్వస్థతకు గురైంది. పరీక్షలు చేస్తే ఆస్తమా అని నిర్ధారణ చేశాం.


ఈ రెండు కేసులను పరిశీలిస్తే.. ఇది చలికాలం కాదు. చినుకు కాలం అస్సలే కాదు. ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటున్నాయి. మరి ఆస్తమా ఎలా సోకింది? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఇక్కడ వాతావరణ మార్పులు కాకుండా వాతావరణ కాలుష్యం ఆస్తమాకు కారణం అయింది.


ఎలా?

డీజిల్ వాహనాల నుంచి వచ్చే పొగ ప్రమాదకరంగా మారుతున్నది. అది క్రమంగా అన్‌సీజనల్ ఆస్తమాకు దారితీస్తున్నది. ఓజోన్.. నైట్రోజన్ డై ఆక్సైడ్.. సల్ఫర్ ఆక్సైడ్.. కార్బన్‌మోనాక్సైడ్ వంటి వాయువులు దీనికి కారణం అవుతున్నాయి.


ఎందుకు?

గాలిలోని టోటల్ సస్పెండెడ్ పర్టిక్యులేట్ మీటర్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి పదార్థాలు గాలి స్వచ్ఛతను నిర్ణయిస్తాయి. దీనిని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటా అంటారు. ఇలాంటి రకరకాల కలుషిత గాలిని పీల్చినప్పుడు శ్వాసనాళాలు.. ఊపిరి తిత్తుల్లోని సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. అక్కడ ఆమ్లగుణం పెరుగుతుంది.


ఏమవుతుంది?

ఆమ్లగుణం వల్ల ఊపిరితిత్తుల పరిమాణం పెరిగిపోతుంది. ఎఫ్‌వీసీ, ఎఫ్‌ఈవీ1 శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఆస్తమా.. బ్రాంఖైటిస్ వ్యాధులు సోకుతాయి. ఏమాత్రం తగ్గుముఖం లేకుండానే తీవ్రతరమై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.


asthma2

ఎలాంటి ప్రభావం?

వాతావరణ కాలుష్యం కారణంగా వచ్చిన ఆస్తమాను అదుపులో ఉంచుకోక నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రధానంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. తీవ్ర ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయి. సీఓపీడీ సమస్యలు ఏర్పడుతాయి. కొందరి గుండె ఫెయిల్యూర్ కూడా అవుతుంది. చిన్నపిల్లల్లో చురుకుదనం.. ఎదుగుదల లోపిస్తాయి.


maxresdefault

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ కట్టుకోవాలి. తరుచుగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా సీయన్‌జీ లేదాఎల్‌ఎన్‌జీ ఇంధనాలు వాడాలి. ఆస్తమా ప్రమాదమైందే.. కానీ నివారించలేనిదేం కాదు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటే దాని భారినుంచి తప్పించుకోవచ్చు.
imdr-muralidhar-reddyage

550
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles