ఇలా చేస్తే దంతాలు క్షేమం


Mon,August 13, 2018 11:28 PM

6-teeth-whitening
-దంత బాధకు మూలాన్ని ప్రారంభంలోనే గుర్తిస్తే చాలావరకు ఫిల్లింగ్‌తోనే సమస్య పోతుంది. రూట్‌కెనాల్ దాకా వెళ్లే అవసరం ఉండదు. మధుమేహం ఉన్నవారు ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యే అవకాశం మరీ ఎక్కువ. వారు ఏ కాస్త చిగురు సమస్య వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవాలి.
-రాత్రివేళ లాలాజలం ఉత్పత్తి కాదు. ఈ కారణంగా రాత్రివేళలోనే దంతాలు ఎక్కువగా బాక్టీరియా బారిన పడతాయి. అందుకే రాత్రివేళ బ్రష్ చేసుకోవడం అతి ముఖ్యం. తరచూ నోటిని పుక్కిళించడం కూడా ఎంతో శ్రేయస్కరం.
-చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్లు మరీ అధికంగా ఉన్నప్పుడు మౌత్‌వాష్ ద్రావణంతో పుక్కిళించడం అవసరం. మామూలుగా అయితే సాధారణ నీటితో పుక్కిళించినా చాలు.
-బ్రష్‌తో శుభ్రం చేసుకున్నాక నిత్యం చూపుడువేలును నిటారుగా ఉంచి, చిగుళ్ల మీద సున్నితంగా మర్దన చేయాలి. దీనివల్ల చిగుళ్లలో రక్తప్రసరణ పెరిగి ఇన్‌ఫెక్షన్ల అవకాశం తగ్గుతుంది. పైగా చిగుళ్లు దంతాలను బాగా అతుక్కుని ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.

88
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles