ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా?


Wed,August 23, 2017 01:08 AM

నా వయసు 59 సంవత్సరాలు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలిని. కొద్దిరోజులుగా మోకాళ్లలో నొప్పి వస్తున్నది. ఇతర ఎలాంటి అనారోగ్యం లేదు. డాక్టర్‌కు చూపిస్తే ఇమ్యూనిటి పెంచుకొమ్మని సలహా ఇచ్చారు. అధికంగా విటమిన్ మందులు, టానిక్‌లు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందా? ఇమ్యూనిటి పెరగడానికి ఏం చెయ్యాలో వివరించండి?
grannyslove

అమృత, హన్మకొండ

ఇమ్యూనిటి అంటే రోగనిరోధక శక్తి అని అర్థం. ఇది శరీరంలోకి చేరే హానికారక సూక్ష్మ క్రిములతో పోరాడి శరీరాన్ని అనారోగ్యం నుంచి కాపాడుతుంది. దీని గురించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్ మందుల రూపంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని పరిశోధనల్లో నిరూపితం కాలేదు.
పెద్ద వారిలో నిరోధక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు కొన్ని జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు.

-పెద్దవారికి ఇచ్చే టీకాలను వేయించుకోవడం వల్ల నిరోధక వ్యవస్థను చురుకుగా ఉంచవచ్చు.
-బీపీ, షుగర్, శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.
-వారానికి కనీసం 5 రోజుల పాటు రోజుకు అరగంటకు తగ్గకుండా వ్యాయామం చెయాలి.
-పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానెయ్యాలి. మద్యం అలవాటు ఉంటే దాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి.
-తగినంత నిద్ర తప్పనిసరి.
-ఆరోగ్యవంతమైన, సమతుల, పౌష్టికాహారం తీసుకోవాలి.
ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో శరీరంలో ఇమ్యూనిటి పెంపొందించుకోవచ్చు.
Drvijey

470
Tags

More News

VIRAL NEWS