ఇది సూపర్ కారు!


Wed,August 22, 2018 04:00 AM

ఎక్కడికైనా వెళ్లేముందు కారులో ఇంధనం నింపుతాం. టైర్ల నిండా గాలి ఉందో లేదో చూసుకుంటాం. కానీ ఈజిప్టుకు చెందిన ఓ మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ పెట్రోల్ బంక్‌కి వెళ్లాల్సిన పని లేకుండా చేశాడు. అదేంటంటే..?
air-car
ఈ కారు నిజంగా సూపర్ కారురే. ఇది కనుక మీ దగ్గర ఉంటే మీకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఖర్చే ఉండదు. ఇంతకీ ఈ కారు దేనితో నడుస్తుందో చెప్పలేదు కదూ! గాలితో నడుస్తుంది. ఈజిప్ట్‌కి చెందిన మహమూద్ యజీర్ అనే మెకానికల్ ఇంజినీర్ దీన్ని తయారుచేశాడు. హెల్వాన్ యూనివర్సిటీలో చదువుతున్న యజీర్‌కి చిన్నపప్పటి నుంచే మోటార్ వెహికల్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే మెకానికల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నాడు. ఈజిప్టు రాజధాని కైరోలో ఈ యూనివర్సిటీ ఉంది. కంప్రెస్డ్ ఆక్సీజన్ ద్వారా ఈ కారును తయారుచేసే ప్రాజెక్టు మొదలుపెట్టి అందుకు కొంతమంది విద్యార్థులను ఒక గ్రూప్‌గా తయారుచేసింది. ఆ గ్రూప్‌లో ఈ కారు తయారీ వెనుక శ్రమించిన కీలక విద్యార్థే యజీర్. 2016లో మొదలైన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 82 వేల 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఈ గాలితో నడిచే కారులో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. మీరు ఎక్కడికైనా ప్రయాణం మొదలుపెట్టే ముందు ట్యాంక్ నిండా కంప్రెస్డ్ ఎయిర్ నింపడం మాత్రం మరిచిపోకండి. ఒక్కసారి ట్యాంక్ నిండా గాలి నింపితే 100 కిలోమీటర్ల వరకు మిమ్మల్ని తీసుకెళ్తుందీ ఎయిర్ కార్. ఆ తర్వాత మళ్లీ ఎయిర్ ఫ్యుయెల్ చేయించాల్సిందే.

979
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles