ఇది కవాట సమస్యేనా?


Fri,August 17, 2018 01:36 AM

నా వయసు 56 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఆయాసం, పొడిదగ్గు, గుండెదడ, ఛాతినొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి గుండె కవాటాల్లో సమస్య అని చెప్పారు. ఈ సమస్యకు చికిత్స ఎలా ఇస్తారు. ఇది పెద్ద సమస్యనా?
- యాదగిరి, నిజామాబాద్

shutterstock
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీలో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సామాన్యంగా గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. వీటిలో రెండు రకాల సమస్యలు రావొచ్చు. కవాటం సన్నబడడం (స్టినోసిస్), కవాటం లీక్ కావడం (రిగర్సిటేషన్). కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ సాధారణంగా ఇందుకు కారణమవుతాయి. కొందరిలో పుట్టుకతో కూడా సమస్యలుండవచ్చు. కవాటాల సమస్యకు కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాదు. ఇలాంటప్పుడు రోగి పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. మైట్రల్ వాల్వు సన్నబడితే బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడిన కవాటాన్ని తిరిగి తెరువొచ్చు. మిగిలిన కవాటాలు సన్నగా మారినా, లీక్ అవుతున్నా వాల్వులోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్‌మెంట్ మాత్రమే పరిష్కారం. గుండె కవాటాలను మార్చి కృత్రిమ కవాటాలను అమర్చే క్రమంలో రెండు రకాల కవాటాలను ఉపయోగించవచ్చు. మెకానికల్ వాల్వు అమర్చినప్పుడు రక్తాన్ని పలుచబరిచే మందులను జీవితాంతం వాడాల్సి ఉంటుంది. ఇక టిష్యూ కవాటాల విషయానికి వస్తే ఇవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఇవి వాడినవాళ్లకు రక్తాన్ని పలుచబరిచే మందుల అవసరం ఉండదు. ప్రస్తుతం శస్త్రచికిత్స కన్నా వాల్వ్ రిపేర్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు.

డాక్టర్
అనూజ్ కపాడియా
సీనియర్
ఇంటర్‌వెన్షనల్
కార్డియాలజిస్టు
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

462
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles