ఇది ఆస్టియోపోరోసిస్ సమస్యేనా?


Wed,August 10, 2016 01:33 AM

iStockMedium
నా వయసు 62 సంవత్సరాలు గత 6 నెలలుగా నేను విపరీతమైన వెన్నునొప్పి, ఎముకల నొప్పితో బాధ పడుతున్నాను. దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదిస్తే ఆయన ఎముక సాంద్రత పరీక్ష నిర్వహించి నేను ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పారు. దయచేసి ఈ వ్యాధి గురించిన పూర్తి వివరాలు తెలుపగలరు?
- విమల, హైదరాబాద్

ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు సంబంధించిన సమస్య. ఈ సమస్య వల్ల ఎముక కణజాలానికి నష్టం జరగడం వల్ల ఎముకలు గుళ్లబారి పెళుసుగా తయారై సులభంగా విరిగి పోతుంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధి వయసు పెరిగిన వారికి మెనోపాజ్ వల్ల లేదా అండశయాలు తొలగించడం వల్ల ఈస్ట్రోజన్ లోపం ఏర్పడిన మహిళల్లో, మెనోపాజ్ దశకు త్వరగా చేరుకున్న చిన్న శరీరాకృతి కలిగిన మహిళల్లో, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, విటమిన్ డి లోపం ఉన్న వారిలో, పౌష్టికాహార లోపం ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి మూడు రకాలుగా ఉంటుంది.

-ప్రైమరీ టైప్ 1 - ఇది మెనోపాజ్ తర్వాత వయసులో ఉన్న వారిలో కనిపిస్తుంది.
-ప్రైమరీ టైప్ 2 - ఇది 75 సంవత్సరాల వయసు పైబడిన వారిలో కనిపించే సెకండరీ ఆస్టియోపొరోసిస్. ఇది ఇతర అనారోగ్య కారణాల వల్ల వచ్చే సమస్య.

చికిత్సలు


-కాల్షియం థెరపీ- కాల్షియం కార్బోనేట్, కాల్షియం పాస్ఫేట్, కాల్షియం నైట్రేట్ కలిగిని సప్లిమెంట్లు డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు.
-విటమిన్ డి - విటమిన్ డి ఇవ్వడం వల్ల కాల్షియం పెరుగుతుంది.
-ఈస్ట్రోజన్ రీ ప్లేస్‌మెంట్ థెరపీ - ఇది చాలా అరుదుగా అవసరమవుతుంది.
-కాల్సిటోనిన్ - మెనోపాజ్ తర్వాత కనీసం 5 సంవత్సరాలు గడిచిన వారికి కాల్షిటోనిన్ అనే కృత్రిమ హార్మోన్ ఆస్టియోపొరోసిస్‌కు చికిత్సగా వాడుతారు. ఇది ముక్కు ద్వారా ఉపయోగించేందుకు వీలుగా స్ప్రేరూపంలో లభిస్తుంది.
-రిలాక్సిసిన్ - ఇది ఈస్ట్రోజన్ అంటగోనిస్ట్. ఇది ఈస్ట్రోజన్ కాదు హార్మోన్ కూడా కాదు. కానీ ఈస్ట్రోజన్‌లా పనిచేస్తుంది.

ఎముక సాంద్రతను పెంచడానికి అలెండ్రోనేట్, మెనోపాజ్ తర్వాత వయసులో ఉన్న వారికి వాడవచ్చు. ఇబాండ్రోనేట్ సోడియం, రేసిడ్రోనేట్ సోడియం మందులు కాల్షియంతో కలిపి కాల్షియం లేకుండాను దొరుకుతాయి.
జొలెండ్రోనిక్ యాసిడ్ అనే మందును సంవత్సరానికి ఒకసారి ఆస్టియోపొరోసిస్ రాకుండా నివారించేందుకు తీసుకోవచ్చు. అయితే ఈ చికిత్సను చేయించడానికి ముందు రెండు రక్తపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా కిడ్నీ పనితీరు, రక్తంలో కాల్షియం స్థాయిలను ముందుగా తెలుసుకొని ఆ తర్వాత చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.

అనబాలిక్ మందులు


టెరిపారైడ్ - టెరిపారైడ్ అనేది పారాథైరాయిడ్ హార్మోన్. ఇది ఎముక నిర్మాణానికి తోడ్పడే హార్మోన్. ఆస్టియోపొరోసిస్ ఉపయోగించే ఒక ప్రత్యేకమైన చికిత్స. ఈ మందులు గుళ్ల బారిని ఎముక సాంద్రతను పెంచడానికి వాడతారు. ఇది ఆస్టియోపొరోసిస్ వల్ల ఎముకలు విరిగే పరిస్థితి ఉన్నవారికి ఇది చాలా వరకు పనిచేస్తుంది.

కాంబినేషన్ డ్రగ్ థెరపి


praveenreddy
రెండు రకాల మందులను కలిపి చికిత్సకు ఉపయోగిస్తారు. టెరిపారడైడ్ అనే అనబాలిక్ మందు ఎముక సాంద్రత పెంచుకోవడానికి డెనోపంచ్ అనే మందు ఎముక నష్టాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు మందులను కలిపి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. అయితే ఈ చికిత్సలన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది.

1753
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles