ఇక కృత్రిమ రెటీనా..!

Mon,March 20, 2017 01:36 AM

dims
రెటీనా డీజనరేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇందుకోసం కొత్త చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. రెటీనా ట్రాన్స్‌ప్లాంట్స్‌ను పరిశధకులు తయారుచేశారు. బాహ్యంగా అమర్చే ఈ ఉపకరణం నుంచి కళ్ల వెనుక భాగానికి వైర్లను పంపిస్తారు. ఈ ఇంప్లాంట్ కాంతి సెన్సిటివ్ పదార్థం కనీసం పాక్షికంగానైనా రెటీనాలను బాగుచేయగలుగుతుంది. తద్వారా మిగిలివున్న చూపైనా పోకుండా నివారించగలుగుతుంది. సిల్క్ లాంటి బయోకంపాటిబుల్ (జీవసంబంధమైన) పదార్థాన్ని ఒక వాహక (కండక్టివ్) పాలిమర్, ఒక కర్బన అర్ధవాహకం (సెమీకండక్టర్)తో కలిపి విద్యుత్తును ఉత్పత్తి చేశారు. ఈ విద్యుత్తు నాడీకణాలకు చేరేలా అమర్చారు.

పరిసరాల్లో ఉన్న కాంతి ఇంప్లాంట్‌పై పడగానే విద్యుత్తు నాడీకణాలకు ప్రసారం అవుతుంది. గతంలో కూడా ఈ దిశగా పరిశోధనలు చేశారు గాని ఇంత మంచి ఫలితాలు ఇవ్వలేదు. వాళ్లు తయారుచేసిన ఫొటోవోల్టాయిక్ పరికరాలు కేవలం అసాధారణ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి లేదా చాలా ఎక్కువ కాంతి ఉన్నపుపడు మాత్రమే పనిచేసేవి. కాబట్టి ఇవి పనికిరాలేదు. ఇప్పుడు చేసిన ఈ పరిశోధన ఎలుకల్లో చాలావరకు విజయవంతమైంది. అయితే విద్యుత్తు నాడీకణాలకు చేరగానే నాడీ ప్రచోదనాలుగా ఎలా మారగలదో ఇంకా వీళ్లు వివరించలేదు. ఈ పరిశోధన ఫలితాలు అందుబాటులోకి రావాలంటే ఇంకా సమయం పడుతుంది.

739
Tags

More News

మరిన్ని వార్తలు...