ఇంట్లో దుర్వాసనా?


Fri,August 24, 2018 01:11 AM

ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుతాం. కానీ.. కొన్ని అజాగ్రత్తల వల్ల ఇంట్లో దుర్వాసన వ్యాపిస్తుంది. ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఇంట్లో దుర్వాసను గురవుతామో తెలిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు కదా. వాటిని తెలుసుకోండి మరి!
bad-smell
-ఇంట్లో రెండు రకాల చెత్తబుట్టలను వాడాలి. ఒక దాంట్లో తడి చెత్త, మరొక దానిలో పొడి చెత్తను వేసేలా చూసుకోవాలి. చెత్తబుట్టను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నిమ్మకాయ ముక్కలను చెత్తబుట్ట చుట్టూ ఉంచడం వల్ల దుర్వాసనను గ్రహించి ఇంటిని తాజాగా ఉంచుతుంది.
-కార్పెట్లు ఇంటిని అందంగా తీర్చిదిద్దుతాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచకపోతే వాటి మీద మురికి చేరి చెడు వాసనకు దారితీస్తుంది. నీటిలో కొంచెం వెనిగార్‌ను వేసి అందులో కార్పెట్‌ను రుద్ది కడగాలి. తరువాత మంచి నీటితో కడిగి ఆరేయాలి.
-చాలామంది ఆహారపదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. కొన్నిరోజులకి వాటి గురించి మర్చిపోతారు. అలా మరిచిపోయిన కూరగాయలు, పండ్లు, మాంసం చెడు వాసనను కలిగిస్తాయి. దీనిని తొలగించడానికి సోడియం బైకార్బొనేట్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ అల్మరాల్లో ఉంచాలి.
-ఆహారపదార్థాలలో వాడే మసాలా దినుసులు నుంచి వచ్చే ఘాటైన వాసన ఇబ్బంది పెడుతుంటుంది. ఇంటిని శుభ్రపరిచినా ఈ వాసన అలాగే ఉంటుంది. దీనిని తొలగించాలంటే గ్యాస్-స్టవ్ మీద వెనిగార్‌ను మరిగించాలి. నీటి నుంచి వచ్చే ఆవిరి గాల్లోకి చేరి ఘాటైన వాసనను తగ్గిస్తుంది.

698
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles